సాధారణంగా నటీనటులు, క్రీడాకారులు ఎక్కువగా ఫేమస్ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా ఉంటారు. బ్రాండ్ అంబాసిడర్లుగా అడ్వర్టజ్మెంట్లు (యాడ్స్) చేస్తుంటారు. అయితే, ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్లుగా సినీ డైరెక్టర్లు ఉండడం చాలా అరుదు. అయితే, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి మాత్రం సినీ ఇండస్ట్రీలో ఎవరికీ లేనంత క్రేజ్ ఉంది. హీరోలను మించిన పాపులారిటీ ఆయనది. దేశమంతా ఎనలేని పేరు ఉంది. దీంతో ఓ ప్రముఖ బ్రాండ్‌కు అంబాసిడార్‌గా మారాడు రాజమౌళి. యాడ్ షూట్ చేశాడు.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పోకు బ్రాండ్ అంబాసిడార్ అయ్యాడు రాజమౌళి. ఆ కంపెనీ కోసం ఓ యాడ్ కూడా చేశాడు. ఈ యాడ్‌కు సంబంధించిన ఓ చిన్న టీజర్‌ను ఒప్పో వెల్లడించింది. దీంట్లో రాజమౌళి డ్యుయల్ రోల్లో కనిపించాడు. స్క్రీన్‌పై రెండు పాత్రలుగా కనిపించాడు. అలాగే సూట్ ధరించి ఎంతో స్టైలిష్‌గా, హ్యాండ్సమ్గా ఉన్నాడు రాజమౌళి. ఒప్పో తీసుకురానున్న కొత్త ఫోన్ కోసం ఈ యాడ్ చేసినట్టు కనిపిస్తోంది. త్వరలోనే పూర్తి అడ్వర్టజ్మెంట్ రావొచ్చు. రాజమౌళి డ్యుయల్ రోల్లో ఉన్న ఈ క్లిప్ వైరల్‌గా మారింది.

ఈ వీడిలో సూటు, బూటు ధరించి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో రాజమౌళి అందరినీ ఆకర్షించాడు. ఆయన వాకింగ్ స్టైల్ హైలెట్ గా నిలిచింది. త్వరలోనే ఈ యాడ్ బయటకు రానుంది. ఇకపోతే ఈ యాడ్ కోసం రాజమౌళి తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాకైపోతారు. తన ముందు హీరోలు కూడా దిగదుడుపే అన్న రేంజ్ లో రాజమౌళి ఛార్జ్ చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం.. తన తొలి యాడ్ కోసం రాజమౌళి ఏకంగా రూ. 3 కోట్లు పుచ్చుకున్నాడట. ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళి ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే అంత మొత్తంలో ఛార్జ్ చేశాడని అంటున్నారు.