ఈమధ్య కాలం లో పెళ్లి ఎంత తొందరగా చేసుకుంటున్నారో, విడాకులు కూడా అంతే తొందరగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లో ఇది చాలా కామన్ అయిపోయింది. ఒకరిని చూసి ఒకరు ఆదర్శంగా తీసుకొని విడాకులు తీసుకుంటున్నారో, లేదా నిజంగానే వాళ్ళ మధ్య ఏది కలిసిరాక విడాకులు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. సమంత మరియు నాగచైతన్య విడిపోయిన తర్వాత నుండి ఈ విడాకుల కేసులు ఎక్కువ అయిపోయాయి.
రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించి, ఆ తర్వాత సినిమాల్లో మరియు వెబ్ సిరీస్ లలో బాగా బిజీ అయిన కుషా కపిల కూడా విడాకులు తీసుకుంది. సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే కుశ కపిల, ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది. 2017 వ సంవత్సరం లో ఆమె జోరావర్ సింగ్ అహ్లువాలియా ని ప్రేమించి పెళ్లాడింది.
ఇన్నాళ్లు కలిసి మంచి దాంపత్య జీవితం అయితే గడిపారు కానీ, ఎందుకో వాళ్ళ మధ్య కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం లేక విడైపోవాల్సి వచ్చిందట. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్ట్ అభిమానుల్లో చాలా బాధ ని కలిగిస్తుంది.
ఆమె పెట్టిన ఆ పోస్టు లో తన భర్త మీద ప్రేమ కనిపిస్తుంది , ఇంతకీ ఆమె ఏమి అనింది అంటే ‘జొరావర్ , నేను ఇద్దరం ఏకాభిప్రాయం తో విడిపోవాలి అనుకున్నాము. విడిపోవడం మా ఇద్దరికీ చాలా కష్టం గానే ఉంది, కానీ ఉన్న పరిస్థితుల కారణంగా, విడిపోవడమే ఇద్దరికీ ఎంతో మంచిది అని అర్థం అవుతుంది, అందుకే ఇద్దరం ఈ నిర్ణయానికి వచ్చాము. మా మధ్య చాలా విషయాల్లో ఏకాభిప్రాయం రావడం లేదు, తరచూ అందువల్ల గొడవలు అవుతున్నాయి. ఇలాంటి సమయం లో విడిపోక తప్పడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.