విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్న రష్మిక ?

- Advertisement -

హీరో శర్వానంద్ కూడా గత కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకుని కుటుంబ సభ్యుడిగా మారాడు. ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. గీతగోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ-రష్మిక తొలిసారి కలిసి నటించారు. ఆ సినిమాలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ గా పండింది. పరుశురాం డైరెక్షన్ వహించిన ఈ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మధ్య సమ్‌థింగ్ ఏదో ఉందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండకు భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. విజయ్, రష్మిక గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని, వీరిద్దరు ఒకరినొకరు విపరీతంగా ప్రేమిస్తున్నారని అంటున్నారు. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో పెళ్లి చేసుకోవాలని రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరి కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నట్లు సీనీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

vijay

అయితే ఈ ఏడాది నిశ్చితార్థం తర్వాత రష్మిక, విజయ్ దేవరకొండ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న రష్మిక, విజయ్ దేవరకొండ అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప-2తో బిజీగా ఉంది. ఇటు విజయ్ దేవరకొండ కూడా సమంతతో ఖుషీ సినిమాలో నటిస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here