కిర్రాక్ ఆర్పీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు జబర్దస్త్ షో లో కమెడియన్ గా కనిపించి తన కామెడితో బాగా పాపులర్ అయ్యాడు.. కొన్ని కారణాల వల్ల షో నుంచి తప్పుకున్నాడు.. ప్రస్తుతం సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు..ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులారిటీ దక్కించుకున్నారు. ఇప్పటికే హైదరాబాదులో మూడు బ్రాంచ్లను ఓపెన్ చేసిన ఆర్పి తాజాగా అనంతపురంకి సంబంధించి ఫ్రాంఛైజీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే…
మాములుగా నెల్లూరు చేపల పులుసుకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. ఇక ఆర్ఫి దాన్ని వ్యాపారంగా ప్రారంభించారు..దాంతో అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరుగురు కాయలుగా దూసుకుపోతుంది..బిజినెస్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి కారణం పబ్లిసిటీ అని చెప్పాలి. ఒకవైపు కిరాక్ ఆర్ పి కి ఉన్న ఫేమ్ తో పాటు అందుకు తగ్గట్టుగానే చేపల పులుసు కూడా అద్భుతంగా ఉండడం మరీ ముఖ్యంగా నెల్లూరు చేపల రుచిని అన్ని ప్రాంతాలకు పాకేలా చేయడమే ఈ బిజినెస్ కి ఇంత డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా కిరాక్ ఆర్పి చేపల పులుసు రేట్లు విని నెటిజన్లు షాక్ అవుతున్నారు..
ఇక విషయానికొస్తే.. అనంతపూర్ బ్రాంచ్ లో కేజీ కోరమీను పులుసు ఎవరైనా కొనుగోలు చేయాలంటే ఏకంగా 1800 రూపాయలు ఖర్చు చేయాలట. ఇకపోతే కోరమీను పులుసు ఎంత రుచికరంగా చేసినా సరే ఆ స్థాయిలో ఖర్చు పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక విధంగా రిస్క్ అని చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక కేజీ కొరమీను ధర 500 రూపాయలు అయితే దీనిని కూరగా వండి వడ్డించడానికి నాలుగు రెట్లు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలా అని జనాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇలా అయితే బిజినెస్ చెయ్యడం కష్టం అని జనాలు అంటున్నారు.. మరి ఆర్ఫి రేట్లు తగ్గిస్తారో లేదో చూడాలి..