తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న భామ శోభితా ధూళిపాళ. తెలుగులో గూఢచారి, మేజర్ తమిళంలో పొన్నియిన్ సెల్వన్
సిరీస్ సినిమాలలో నటించిన శోభిత ప్రస్తుతం స్లమ్ డాగ్ మిలియనీర్
ఫేమ్ దేవ్ పటేల్ నటిస్తూ రూపొందిస్తున్న హాలీవుడ్ మూవీ
మంకీ మ్యాన్`లో నటిస్తోంది. ఇదిలా ఉంటే శోభిత తెలుగు హీరో నాగచైతన్యతో డేటింగ్ లో ఉందంటూ కొంత కాలంగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇటీవల ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం నాగచైతన్య, సమంతలపై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం వైరల్ అవుతోంది. సమంత కెరీర్ జర్నీ చాలా కూల్ గా అనిపిస్తోందని తెలిపింది. ఒకసారి ఆమె చేసిన సినిమాలు చూసినట్లయితే తను ప్రాజెక్ట్‌లను డీల్ చేసిన విధానం బాగుంటుందిఅని తెలిపింది. ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ
అతడు చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఎంతో ఒద్దికగా ఉంటాడు. అతడి స్వభావాన్ని మెచ్చుకుని తీరాల్సిందే` అంటూ చైతూపై ప్రశంసల వర్షం కురిపించింది.
శోభిత తాజా వ్యాఖ్యలతో మళ్లీ రూమర్లు మొదలవడం కాయంగా కనిపిస్తోంది. ఈ వార్తలపై శోభితని స్పందించమని అడిగితే నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉన్న వ్యక్తులు దీనిపై మాట్లాడాలని తెలివిగా స్పందించింది. అయినా సరే ఇప్పటికీ శోభితపై రూమర్లు ఆగడం లేదు. తనపై ఎన్ని పుకార్లు పుట్టుకొస్తున్నా శోభిత మాత్రం వాటన్నింటినీ లైట్ తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఏమాయ చేసావే
సినిమా టైమ్‌లో ప్రేమలో పడిన నాగచైతన్య, సమంత ఏడేళ్ల పాటు ప్రేమాయనాన్ని సీక్రెట్‌గా సాగించి ఒక్కసారిగా పెళ్లి వరకు తీసుకెళ్లడం తెలిసిందే. 2017లో వివాహం చేసుకున్న ఈ జంట 2021లో విడాకుల తీసుకుని విడిపోయి అందరికి షాకిచ్చింది.