మిల్కీబ్యూటీ తమన్నా-విజయ్ వర్మ పీకల్లోతు ప్రేమ లో మునిగితేలుతోన్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రేమాగీమా లేదని కహానీలు చెప్పిన జోడీ తర్వాత పబ్లిక్ గానే ప్రేమ లో ఉన్నామని ట్విస్ట్ఇచ్చారు. అందుకు ‘లస్ట్ స్టోరీస్ -2’ వెబ్ సిరీస్ వేదిక అయింది. ఇందులో ఇద్దరు జంటగా నటించడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈనెల 29న వెబ్ సిరీస్ నెట్ ప్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారం పనులు జరుగుతున్నాయి. ఈ సిరీస్ కోసం ‘నో కిస్’ పాలసీని బ్రేక్ చేస్తున్నట్లు తమన్నా చెప్పినప్పుడు తన లవర్ రియాక్షన్ ఏమిటో ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘‘స్క్రిప్ట్ పనుల్లో భాగంగా సుజోయ్ ఘోష్ ఆఫీస్‌లో తమన్నాను కలిశా. అక్కడే మా మధ్య పరిచయం పెరిగింది. కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలపై మేమిద్దరం మాట్లాడుకున్నాం. సుమారు 17 ఏళ్ల నుంచి తాను ఈ రంగంలో ఉన్నానని, తన కాంట్రాక్ట్‌లో తప్పకుండా ‘నో కిస్’ పాలసీని ఫాలో అవుతుంటానని, ఇప్పటివరకూ తాను ఇలాంటి ప్రాజెక్ట్ అస్సలు చేయలేదని తమన్నా నాతో చెప్పింది. అంతేకాకుండా, ఆన్‌స్క్రీన్‌లో తాను ముద్దు పెట్టుకోనున్న మొదటి నటుడిని నేనేనని చెప్పింది. ఆ మాట వినగానే.. ‘థ్యాంక్యూ’ అని బదులిచ్చా’’ అని విజయ్ వర్మ తెలిపారు.

‘స్టోరీ చదివి హీరోయిన్ పాత్ర ఎవరు చేస్తున్నారని అడిగా ను. వెంటనే తమన్నా అన్నారు. పర్పెక్ట్ ఛాయిస్ అనుకున్నాను. ఆ పాత్రకి తమన్నా మరింత గ్లామర్ తీసుకొచ్చింది. ఆమె నటించే ప్రతీ పాత్రలో లోతు గా విశ్లేషించి పనిచేస్తుంది. చాలా శ్రద్దగా నటిస్తుంది. అలా కొందరు నటులే పనిచేయగలరు. అలాంటి వాళ్లలో తమన్నా ఒకరు. సహ నటులు సరదాగా ఉంటే షూటింగ్ సమయం తెలియకుండా గడిచిపోతుంది. ఆ రకంగా తమన్నా ఓ ఐకాన్ అనొచ్చు. తమన్నా నటించిన ‘బాహుబలి‘ థియేటర్లో చూసాను. ‘బబ్లీ బౌన్సర్’ కూడా చూసాను. వాటి లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. ‘లస్ట్ స్టోరీస్ -2’ చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఆమెని ప్రశంసిస్తారు.