విజయ్ దేవరకొండ, రష్మిక ఫోటో లీక్ .. డేటింగ్ లో ఉన్నారంటూ…

- Advertisement -

టాలివుడ్ ఇండస్ట్రీలో రష్మిక, విజయ్ దేవరకొండలకు మంచి క్రేజ్ ఉంది.. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు జనాలను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాయి.. దాంతో వీరిద్దరూ రొమాంటిక్ ఫైర్ అయ్యారు.. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.. ఏ ఫంక్షన్స్ జరిగిన ఇద్దరు కలుస్తూ వచ్చారు.. ఇక వీరిద్దరూ కనిపించినప్పుడల్లా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనే వార్తలు పుట్టుకొచ్చేవి.. వీరిద్దరు ఈ వార్తలను కండిస్తున్నా కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టేవి.. తాజాగా నెట్టింట వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి చక్కర్లు కొడుతుంది..

విజయ్ దేవరకొండ, రష్మిక
విజయ్ దేవరకొండ రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక తరచుగా కలిసి తిరుగుతూ ఉంటారు. స్నేహితులతో మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి గేదర్ అవుతుంటారు. కలిసి విహారయాత్రలు చేయడం.. ఎయిర్ పోర్టులలో కనిపించడం అందరికీ తెలిసిందే. మేము మంచి స్నేహితులము మాత్రమే అని వారు చెప్పుకున్నప్పటికీ ఇద్దరు కలిసినప్పుడల్లా పెద్ద వార్త అవుతోంది. తాజాగా ఈ జంట ఒక కేఫ్‌లో కనపడటంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారా? అంటూ మళ్లీ చర్చ మొదలైంది. వీరిద్దరితో పాటు చాలా మంది ఉన్నట్లు సమాచారం..

రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి డియర్ కామ్రేడ్, గీత గోవిందం సినిమాల్లో నటించారు.అందుకే వీరి ఫ్యాన్స్ కూడా అదే నిజమని నమ్ముతున్నారు.. ఇటీవల కాలంలో చాలా మంది జంటలు మా ఇద్దరి మద్య ఏం లేదంటూనే పెళ్లి పీటలవరకు తీసుకెళ్లారు.. ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నారు. వీరిలాగే ఎప్పుడో సడెన్‌గా విజయ్ దేవరకొండ, రష్మిక కూడా అదే చేసినా చేస్తారేమో ఆశ్చర్యం లేదంటూ జనాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here