నిన్న మొన్నటి వరకు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఏలిన స్టార్ హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే. మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఈమెని తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు క్యూ కట్టారు. ఈమెకి డేట్స్ సర్దుబాటు చెయ్యలేక చాలా ఇబ్బంది అయ్యేది పాపం.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా ఈమె చేతి నుండి జారిపొయ్యెలా ఉంది.

కొత్తగా వచ్చిన హాట్ బ్యూటీ శ్రీలీల దెబ్బకి, పూజ హెగ్డే కెరీర్ మొత్తం తలక్రిందులు అయిపోయాడు. అందం, అభినయం, నటన మరియు డ్యాన్స్ ఇలా కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజి లాగ ఉండే ఈ హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు. రీసెంట్ గానే ఈమె మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మరియు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల్లో ఎంపిక అయ్యింది.

ఈ చిత్రాలలో ఈమెతో పాటుగా పూజ హెగ్డే కూడా సెలెక్ట్ అయ్యింది. అయితే ఆమెకి ఈ రెండు సినిమాల్లో తనకంటే ఎక్కువగా శ్రీలీల కి ప్రాముఖ్యత ఇస్తున్నారు అనే కోపం తో రీసెంట్ గానే ఈమె ‘గుంటూరు కారం’ చిత్రం నుండి తప్పుకుంది. ఇప్పుడు ఈమె ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుండి కూడా తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలలో పూజ హెగ్డే కి ఒక్కో సినిమాకి గాను నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అలా కేవలం ఈగో తో ఈమె 8 కోట్ల రూపాయిలను మిస్ చేసుకుందట.

రీసెంట్ గానే ఆయా నిర్మాతలకు తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసిందట. నిన్న మొన్నటి వరకు ఒక రేంజ్ డిమాండ్ తో కొనసాగుతున్న పూజ హెగ్డే కెరీర్ ఒక్కసారిగా అయ్యోమయ్యం లో పడింది. దానికి తోడు ఆమెకి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా రావడం తో స్టార్ హీరోలు ఈమెతో సినిమాలు చేసేందుకు భయపడుతున్నారట. ఇక దీంతో ఈమె కూడా తమన్నా మరియు రకుల్ ప్రీత్ సింగ్ లాగ వెబ్ సిరీస్ లలో అడల్ట్ కంటెంట్ సినిమాలు చేసుకోవాల్సిందే అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
