కార్తికేయ 2 తర్వాత నిఖిల్ రేంజ్ పెరిగింది. తాను పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తోన్న స్పై సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. గత కొన్ని రోజులుగా హీరో నిఖిల్, నిర్మాతల మధ్య కొన్ని వివాదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి నిఖిల్ డబ్బింగ్ చెప్పడం లేదని చాలా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ నిజం కాదని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. స్పై సినిమా విడుదలకు సమయం తక్కువగా ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడంతో ఈ సినిమాను వాయిదా వేయడమే మంచిదని దర్శక, నిర్మాతలకు నిఖిల్ సూచించినట్లు సమాచారం. కానీ ఈ విషయంలో నిర్మాతలు నిఖిల్ మాటలను పట్టించుకోకుండా ఈ నెల 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కానీ నిఖిల్ అందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య పలు వివాదాలు తలెత్తాయి. అయితే అవన్నీ పుకార్లే అని తాజాగా నిఖిల్ చెప్పాడు. అలాగే దర్శకుడు కూడా తనను చాలా సంతృప్తి పరచాలని భావించారని, అయితే ఈరోజు ప్రెస్ మీట్‌కి కాస్త ఆలస్యమైనా వచ్చి ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చాను అని ట్రైలర్ లాంచ్ వేడుకలో నిఖిల్ తెలిపాడు. ఒక్కో టిక్కెట్టుకు ప్రేక్షకులు రూ.250 ఖర్చు చేస్తున్నారు. సినిమా క్వాలిటీ తక్కువగా ఉందని ఆయన భావిస్తే మార్నింగ్ షో తర్వాత థియేటర్లలో రద్దీ ఉండదు. టిక్కెట్టు ఖర్చు వృధా అని ప్రేక్షకులు భావించకూడదని నిఖిల్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే నిఖిల్ సినిమా నాణ్యత పరంగా ఏమాత్రం తగ్గిన తాను సహించానని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నిఖిల్ ఎట్టకేలకు వివాదాలకు చెక్ పెట్టారు.