రామ్ చరణ్ కూతురు జాతకంపై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -

మెగా హీరో రామ్ చరణ్, ఉపాసనలు తల్లి దండ్రులు అయ్యారు.. ఉపాసన నిన్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రామ్ చరణ్ కి కూతురు పుట్టడంతో కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.. మెగా ఫ్యామిలీలోకి మరో చిన్నారి వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు.. చిరంజీవి మీడియా వేదికగా తన ఆనందం తెలియజేశారు. తమ ఇష్టదైవం ఆంజనేయ స్వామి మంగళవారం రోజు బిడ్డను ప్రసాదించాడని అన్నారు. రామ్ చరణ్ తండ్రి కావాలనేది ఎన్నో ఏళ్ల నిరీక్షణ. అందుకే ఆనందం వెల్లివిరిసింది. బంధువులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పాప శుభఘడియల్లో పుట్టింది అంటున్నారు. ఈ మధ్య కాలంలో మా కుటుంబంలో జరిగిన శుభాలకు ఈ పాపనే కారణం అంటూ చెప్పుకొచ్చారు..

వేణు స్వామి
వేణు స్వామి

ఇది ఇలా ఉండగా.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పాప జాతకం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..ఉపాసన కూతురు రాత్రి 1:49 నిమిషాలకు జన్మించింది. అంటే పునర్వసు నక్షత్రం, రెండవ పాదం మిధునరాశిలో జన్మించింది. కాబట్టి జన్మనం కోణంగి అని చెప్పొచ్చు. ఇక రామ్ చరణ్ రాశి రోహిణి, ఉపాసన రాశి కృతిక. పాపది పునర్వసు నక్షత్రం. ముగ్గురు దేవత అంశం కలిగి ఉన్నారని ఆయన అన్నారు..

రామ్ చరణ్ కూతురికి రాజయోగం కనిపిస్తుంది. ఆమె కుటుంబంలో మరిన్ని సంతోషాలు, శుభాలు తీసుకు వస్తుంది. చిరంజీవి జాతకంతో సమానంగా ఉంది. పాప భవిష్యత్ లో చరిత్ర సృష్టిస్తుంది. రామ్ చరణ్, ఉపాసనల కన్నా ఎక్కువగా ఫెమస్ అవుతుంది… కానీ జాతకంలో చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయి. ఆమెకు నరాలు, పంటి, చెవికి సంబంధించిన సమస్యలు రావొచ్చు.. ఈ పాపే వారికి వారసురాలు.. రామ్ చరణ్ దంపతుల జాతకం ప్రకారం మరో బిడ్డను పొందే అవకాశం లేదని చెప్పుకొచ్చారు..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here