టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గుంటూరు కారం
. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్‌ల కలయికలో దాదాపు పన్నెండేళ్ల విరామం తరువాత వస్తున్న సినిమా ఇది. అతడు, ఖలేజా వంటి సినిమాల తరువాత మహేష్‌తో కలిసి త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కావడంతో ఇది హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో మహేష్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే, లేటెస్ట్ సెస్సేషన్ శ్రీలీల నటిస్తున్నారు. మహేష్ లుక్‌తో పాటు శ్రీలీలకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.

కానీ ఇంత వరకు పూజా హెగ్డే స్టిల్స్ మాత్రం బయటికి రాలేదు. మేకర్స్ కూడా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా నుంచి బుట్టబొమ్మ పూజా హెగ్డే తప్పుకుందని, ఆ కారణంగానే ఆమెకు సంబంధించిన స్టిల్స్ ఏవీ బయటకు రాలేదని ప్రచారం జరుగుతోంది. షూటింగ్ షెడ్యూల్, స్క్రిప్ట్‌లో త్రివిక్రమ్ చేసిన మార్పుల కారణంగానే పూజా హెగ్డే ఈ సినిమాకు గుడ్ బై చెప్పేసిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఆమె స్థానంలో సార్
,విరూపాక్ష
చిత్రాల ఫేమ్ సంయుక్త మీనన్‌ని త్రివిక్రమ్ ఫైనల్ చేశారని, త్వరలోనే తను సెట్ లోకి అడుగుపెట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలోనే సంయుక్త మీనన్ కూడా ఇందులో నటిస్తుందని ప్రచారం జరిగింది.

డేట్ సమస్యల కారణంగా పూజా హెగ్డే సినిమా నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. జూన్- ఆగస్టు టైమ్‌ఫ్రేమ్‌లో పూజా హెగ్డే ఇతర సినిమాలు చేయాల్సి ఉంది. ఈ టైమ్‌లో గుంటూరు కారం సినిమా వల్ల ఇతర చిత్రాల షెడ్యూల్‌కు ఆటంకం కలుగుతుందని ఆమె భావించిందని సమాచారం. షెడ్యూల్స్ సరైన టైమ్‌కి పూర్తికాకపోవడం, కొన్ని సీన్లు రీషూట్ చేయడం, అనుకున్న సమయానికి షెడ్యూల్స్ పూర్తికాకపోయినా.. కొత్త షెడ్యూల్స్ ప్రకటించడం, కొన్ని షెడ్యూల్స్‌లో జరిగిన సన్నివేశాలను రీ షూట్ చేయడం వంటి వాటి పట్ల పూజా హెగ్డే తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. కానీ కొందరు మాత్రం త్రివిక్రమ్ తో పూజా హెగ్డేకు బ్రేకప్ అయిందని.. అందుకే ఈ ప్రాజెక్ట్ లోకి అనుకోకుండా సంయుక్త వచ్చిందని అంటున్నారు. ఏదేమైన ఈ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ుంది.