ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ కోసం ఎంతోకాలం నుంచి అభిమానులు ఎధురుచూశారు. కానీ మూవీ విడుదలయ్యాక మాత్రం చాలా మంది నిరాశకు గురయ్యారు. ఎందుకంటే తాము ఊహించుకున్న రామాయణం ఒకటి వారు చూపించింది మాత్రం మరో రామాయణం కావడం విశేషం. వాల్మీకి రామాయణాన్ని వక్రీకరించారు అంటూ చాలా మంది విమర్శిస్తున్నారు. ఆంజనేయ స్వామికి గడ్డం పెట్టి మీసాలు తీసివేయడం రాముడు ఓ సన్నివేశంలో ఏసు ప్రభులా కనిపించడం ఆంజనేయుడితో మాస్ హీరో లాగా డైలాగులు చెప్పించడం కొన్ని అభ్యంతకర డైలాగులు ఉండటం ఎవరికీ నచ్చలేదు. దీంతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
అంతేకాదు.. డైరెక్టర్ రామాయణాన్ని తెరకెక్కించాము అని చెప్పగా.. మేము అసలు రామాయణం రూపొందించలేదు అంటూ రైటర్ మనోజ్ చెప్పడంతో మరిన్ని విమర్శలు వచ్చాయి. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హనుమంతుడు అసలు దేవుడే కాదు.. కేవలం భక్తుడు మాత్రమే అంటూ మరోసారి రైటర్ మనోజ్ కామెంట్స్ చేయడం మరింత వివాదాస్పదమయ్యింది. ఇక ఇప్పుడు ఆదిపురుష్ సినిమా మరో సమస్యలో పడింది. ఈ చిత్రంలో విభీషణుడి భార్య కనిపిస్తుంది. అయితే ఆమె క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం ఇప్పుడు ప్రజలకు నచ్చడం లేదు.
నిజంగా విభీషణుడి భార్య అలా ఉంటుందా ? అనే సందేహం కలుగుతుంది. ఇందులో ఆమె స్లీవ్ లెస్ వేసి కనిపించడం.. రాత్రివేళ గుడారాల మధ్యన బయటకొచ్చి పైట సర్దుకుని వస్తున్నట్లుగా ఆమెను చూపించడం.. ఇక లక్ష్మణుడు మూర్ఛబోతే విభీషణుడి భార్య సంజీవిని గురించి చెప్పడం.. ఆ తర్వాత ఆమె దగ్గరుండి లక్ష్మణుడికి సపర్యలు చేస్తున్నట్లు చూపించడం మరింత ఆశ్చర్యం కలిగించింది. అలాగే రాముడి యుద్ధ శిబిరంలో ఆమె ఎందుకు ఉంది అనే అనుమానం కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ సినిమాలో విభీషణుడి భార్య గా నటించింది తృప్తి దోరద్మల్ అలియాస్ అయేష్ మధుకర్. బుల్లితెరపై ఆమె ఫేమస్ నటి.