అనుష్క అసలు పేరు అదేనా..? ఆ హీరో బలవంతం చెయ్యడం వల్లే పేరు మార్చుకుందా!

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా హీరోయిన్ గా పరిచయమై, తొలి సినిమా నుండే తన అందచందాలతో ఆకట్టుకుంటూ, అనతి కాలం లోనే సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిన హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి. ఈమెకి సౌత్ లో ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉంది.ఆమె ని పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యడానికి కోట్లు ఖర్చు పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడరు దర్శక నిర్మాతలు.

అనుష్క
అనుష్క

ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘అరుంధతి’ చిత్రం ఆరోజుల్లో ఆ రేంజ్ ప్రభంజనం సృష్టించింది. కొంత మంది స్టార్ హీరోలకు ఈ సినిమా రికార్డ్స్ ని అందుకోవడానికి సుమారుగా 8 ఏళ్ళు పట్టింది. ఇక బాహుబలి సిరీస్ తో ఆమె ఫేమ్ టాలీవుడ్ మరియు బాలీవుడ్ ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళింది. ఈమె చివరగా వెండితెర మీద కనిపించిన ‘భాగమతి’ చిత్రం పెద్ద హిట్ అయ్యి సుమారుగా 40 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.

Anushka

ప్రస్తుతం ఆమె ప్రముఖ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా చేస్తుంది. రీసెంట్ గానే ఈ సినెమనకి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఇదంతా పక్కన పెడితే అనుష్క మొదటి సినిమా అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం అని అందరికీ తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యినప్పటికీ అనుష్కకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

- Advertisement -
Anushka shetty

అయితే అనుష్క ఈ సినిమాకి ఆడిషన్స్ కి వచ్చినప్పుడు తన పేరు ని ‘స్వీటీ’ అని రాసిందట. సెట్స్ లో ఉన్నప్పుడు అందరూ ఆమెని స్వీటీ అనే పిలిచేవారట. కానీ నాగార్జున కి స్క్రీన్ నేమ్ గా ఆ పేరు ఎందుకో నచ్చలేదు. ఆ సమయం లోనే అనుష్క అనే సింగర్ షూటింగ్ లొకేషన్ కి వస్తూ ఉండేది. ఆమె పేరు వినగానే, ఈ పేరు నువ్వు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని అన్నాడట నాగార్జున. ఒక రెండు రోజులు పిలిచి చూడండి సార్, అలవాటు అయితే కచ్చితంగా అదే పెట్టేసుకుంటాను అని అన్నిందట. అప్పటి నుండి ఆమె అనుష్క గా మారిందని చెప్తుంటారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here