డిఫరెంట్ తరహా వ్యక్తిత్వం తో ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూనే శివ చిత్రం లో విలన్ గా చేసాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యినప్పటి నుండి జేడీ చక్రవర్తికి మంచి గుర్తింపు లభించింది.ఆ తర్వాత కూడా ఎక్కువగా ఆయన రామ్ గోపాల్ వర్మ మరియు కృష్ణవంశీ సినిమాల్లోనే హీరోగా చేస్తూ వచ్చాడు.

కెరీర్ లో హిట్స్ కూడా చాలా గట్టిగానే ఉన్నాయి, కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ , కోలీవుడ్ లలో ఈయనకి సూపర్ హిట్స్ ఉన్నాయ్. అలా నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపుని తెచ్చుకున్న జేడీ చక్రవర్తి ఈమధ్య కాలం లో ఎక్కువగా క్యారక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. కానీ చాలా కాలం తర్వాత ఆయన ‘దయ’ అనే చిత్రం తో హీరో గా మరోసారి మన ముందుకు వచ్చాడు.

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూస్న ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూస్ లో యాంకర్ సినిమా గురించి మాత్రమే కాకుండా, చక్రవర్తి వ్యక్తిగత జీవితం గురించి కూడా సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే పలు వార్తల గురించి కొన్ని ప్రశ్నలు అడిగింది. సోషల్ మీడియా లో చాలా కాలం నుండి జేడీ చక్రవర్తి భార్య అతనిపై విష ప్రయోగం చేసి చంపాలని చూసిందని ప్రచారం అయ్యేది.

దీని గురించి జేడీ చక్రవర్తి ని యాంకర్ అడగగా ‘ఈ విషయం మీదాకా వచ్చిందా, నేను కేవలం ఇద్దరు ముగ్గురుకి మాత్రమే తెలుసు అని ఇన్ని రోజులు అనుకుంటూ ఉన్నాను. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు, కానీ నాకు శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రంగా ఉండేవి, ప్రపంచం లో ఉన్న డాక్టర్స్ మొత్తానికి చూపించాను, కొంత మంది అయితే ఎక్కువ కాలం బ్రతకను అని చెప్పారు, అయితే నటుడు ఉత్తేజ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ , వాడి ద్వారా ఒక డాక్టర్ ని పంపించాడు, అతను టెస్టులు చెయ్యగా చాలా కాలం నుండి నీకు స్లో పాయిజన్ ఇస్తున్నారని, ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడం వల్ల , ఆ స్లో ఫైజాన్ శరీరానికి బాగా ఎక్కేసిందని చెప్పారు, అదంతా నా భార్య ఇచ్చే కషాయం వల్లే అని తెలిసింది’ అంటూ చెప్పుకొచ్చాడు.