మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన త్వరలోనే తల్లితండ్రులు కాబోతున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. పెళ్ళైన పదేళ్ల తర్వాత వీళ్లిద్దరు ఒక బిడ్డకి జన్మని ఇవ్వబోతున్నారు. అభిమానులు తమ అభిమాన హీరో కి బిడ్డ పుట్టబోతున్నాడని సంబరాల్లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక చిరంజీవి ఎంతో గర్వంగా భావించే తన బిడ్డ రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అనే వార్త ఆయన మనసుని ఎంత సంతోషానికి గురి చేసి ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇంటర్వ్యూస్ లో ఆయన ఈ విషయం గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన ముఖం లో ఎంతో సంతోషాన్ని మనం గమనించొచ్చు.ఇక పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసనకు ఇప్పటి నుండే తన మిత్రులు మరియు సన్నిహితుల నుండి కానుకలు రావడం మొదలయ్యాయి. ఆమె అపోలో హాస్పిటల్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
అలా ఆమె ప్రజ్వల ఫౌండేషన్ కి కూడా ఎన్నో విరాళాలు ఇచ్చింది. ప్రజ్వల ఫౌండేషన్ ,హ్యూమన్ ట్రాఫికింగ్ కి గురై వెనక్కి రాబడిన మహిళలకు ఆశ్రయం ఇస్తుంది. వేలాది మంది స్త్రీలు ఈ ఫౌండేషన్ ద్వారా ఉపాధి పొందారు. ఈ ఫౌండేషన్ కి ఉపాసన ఎన్నో సేవాకార్యక్రమాలు చేసిందనే కృతజ్ఞతతో, అందులో ఉండే మహిళలు స్వయంగా తమ చేతులతో చేసిన హ్యాండ్ మేడ్ ఊయల ని ఉపాసనకు బహుమతి గా ఇచ్చారు. ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకుంది.
ఈ ఊయల ఆత్మగౌరవం మరియు ఆశకి ప్రతీకగా నా బిడ్డకి గుర్తుగా నిలిచిపోతుందని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అయితే హ్యాండ్ మేడ్ ద్వారా చెయ్యబడిన ఇలాంటి సుందరమైన వస్తువులకు విదేశాల్లో డిమాండ్ మామూలు రేంజ్ లో ఉండదు. కొన్ని కొన్ని చోట్ల లక్ష డాలర్స్ ని పెట్టి కొనేవాళ్ళు కూడా ఉంటారట, లక్ష డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 80 లక్షల రూపాయిలు అన్నమాట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
We are honoured & humbled to receive this heartfelt gift from the incredible young women of #PrajwalaFoundation.
— Upasana Konidela (@upasanakonidela) June 17, 2023
This handcrafted cradle holds immense significance, symbolizing strength, resilience & hope.
It represents a journey of transformation and self-respect that I want… pic.twitter.com/njRU4SfnaO