యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా , సుమారుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ మన రామాయణ ఇతీహాసాన్ని ,ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ పేరు తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఈ చిత్రం నిన్న అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదలైంది,కానీ ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ రావడం తో ట్రేడ్ వర్గాలు తీవ్రమైన నిరాశకి గురయ్యాయి.కనీసం ఓపెనింగ్ అయినా వేరే లెవెల్ లో వస్తుందేమో అని అనుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో చాలా యావరేజి వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.
ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ రైట్స్ ని 90 కోట్ల రూపాయలకు, అలాగే తెలంగాణ రైట్స్ ని 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు బయ్యర్స్. ఆంధ్ర వసూళ్లు ఒక్కసారి చూస్తే రాయలసీమ ప్రాంతం లో ఈ సినిమాకి ప్రభాస్ గత చిత్రం ‘రాధేశ్యామ్’ కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. రాధేశ్యామ్ చిత్రానికి 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ రాగా, ‘ఆదిపురుష్’ చిత్రానికి మూడు కోట్ల 45 లక్షల రూపాయిలు మాత్రమే వచ్చింది, రాయలసీమ కంటే సీడెడ్ లో ఎక్కువ వసూళ్లు రావడం విశేషం, ఇక్కడ ఈ సినిమాకి మొదటి రోజు మూడు కోట్ల 68 లక్షల షేర్ వసూళ్లు వచ్చింది.
ఇక తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 32 లక్షలు, నెల్లూరు లో 78 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కోట్లు,గుంటూరు లో 4 కోట్లు మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ లో 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ తెలంగాణ లో మాత్రం బంపర్ ఓపెనింగ్ దక్కింది, ఇక్కడ ఈ సినిమాకి మొదటి రోజు 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి, అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఆదిపురుష్ సినిమా మొదటి రోజు 31 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది, ఓవర్సీస్ లో 1.4 మిలియన్ డాలర్స్ రాగ, కర్ణాటక నాలుగు కోట్లు, హిందీ లో 15 కోట్లు అలా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి దాదాపుగా 60 కోట్ల రూపాయిల షేర్ కి దగ్గర్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.