పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసిన సినిమా పుష్ప.. ఈ సినిమాతో బన్నీ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు.. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ సినిమా కూడా తెరకేక్కుతుంది.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమాలోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ , డైలాగ్స్ అండ్ డాన్స్ స్టెప్స్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. దీంతో మూవీకి వరల్డ్ వైడ్ పాపులారిటీ లభించింది. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి…

ఈ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో మేకింగ్ వీడియో లీక్ అయ్యింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇక ఆ అంచనాలను అందుకునేలా మూవీ టీం సెకండ్ పార్ట్ ని మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ షూటింగ్ కూడా లేటు అవుతూ వస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ అండ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్స్ నుంచి ఒక వీడియో లీక్ అయ్యింది. ఆ వీడియోలో ఎర్రచందనం లోడ్ తో ఉన్న నాలుగు లారీలు నదిలో వెళ్తుంటే, వాటిని ఛేజ్ చేస్తూ రెండు జీపులు వెనకాలే వస్తున్నాయి.
ఈ సీన్ అవుట్ డోర్ చిత్రీకరణ కావడంతో కొందరు అభిమానులు ఆ విజువల్స్ ని ఫోన్ లో షూట్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు..ప్రస్తుతం ఆ సీన్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ విలన్స్ గా కనిపిస్తే.. సెకండ్ పార్ట్ లో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. అలాగే జగపతిబాబు ఈ పార్ట్ లో ఒక బలమైన పాత్రతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..