సోషల్ మీడియాలో కొంతమంది మెగా హేటర్స్ అతి ఘోరంగా కామెంట్లు పెడుతున్నారు. మరి మెగా ఫ్యామిలీ గురించి చెడుగా కామెంట్లు పెట్టడానికి అసలు కారణం ఏంటంటే.. మెగా ఫ్యామిలీలో కూతుర్లకు పెళ్లిళ్లు అచ్చిరావు అని ఇప్పటికే చాలాసార్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత పెళ్లి మొదట ఉదయ్ కిరణ్ తో అనుకొని ఆ పెళ్లి పెటాకులయింది.
ఆ తర్వాత చిన్న కూతురు శ్రీజ కూడా ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఇక నిహారిక కూడా తన భర్తతో దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా మెగా ఫ్యామిలీ లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ చాలా సంవత్సరాల నుండి సీక్రెట్ గా రిలేషన్లో ఉంటూ ఎక్కడ కూడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారు.
ఎంగేజ్మెంట్ అయ్యాక నాలుగైదు రోజులకే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ ఇటలీ వెకేషన్ కి వెళ్ళినట్టు వార్తలు వినిపించాయి. అంతేకాదు వీరికి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ ఫోటోని చూసిన కొంత మంది మెగా హేటర్స్ మెగా ఫ్యామిలీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పెళ్లికి ముందే హనీమూన్ కు వెళ్తారా.. మీరు కూడా వాళ్లలాగా విడాకులు తీసుకుంటారా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అలా చేయద్దు అంటూ కోరుకుంటున్నారు.