యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంబించిన అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో జరిగాయి. టాలీవుడ్ మరియు బాలీవుడ్ ట్రేడ్ పండితులు కూడా ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ని ఊహించలేదు, ఎందుకంటే టీజర్ విడుదల అయ్యినప్పుడు ఈ చిత్రం పై జరిగిన నెగటివిటీ అలాంటిది.
కానీ గడిచిన రెండు నెలల్లో ఈ సినిమా జనాల్లో ఉన్న నెగటివ్ వేవ్ మొత్తాన్ని రూపుమాపి, అద్భుతమైన క్వాలిటీ ప్రమోషనల్ కంటెంట్ తో చిత్రం పై జీరో హైప్ నుండి, కనీవినీ ఎరుగని రేంజ్ హైప్ ని పెంచుకుంది. ఇక శ్రీ రాముడు అంటే నార్త్ ఇండియన్స్ కి ఎంత పిచ్చి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అక్కడ మూవీ యూనిట్ ఒక్క ప్రమోషన్ కూడా చెయ్యలేదు, కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ‘న భూతో..న భవిష్యతి’ అనే రేంజ్ లో ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు బాలీవుడ్ లో 40 కోట్ల రూపాయలకు పైగానే నెట్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన హీరోలు కేవలం షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ మాత్రమే. ఇప్పుడు వాళ్ళ తర్వాత ప్రభాస్ కూడా ఈ లిస్ట్ లో చేరబోతున్నాడు.
ఇది కేవలం అంచనాలు మాత్రమే, రేపు టాక్ అద్భుతంగా వస్తే 60 కోట్ల రూపాయిల నెట్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే ఖాన్స్ కూడా ఈ రికార్డుని అందుకోలేరు.పాన్ వరల్డ్ రేంజ్ గుర్తింపుని దక్కించుకున్న రాజమౌళి లాంటి డైరెక్టర్స్ కి కూడా ఇది కష్టమే. మరి ఈ సినిమా బాలీవుడ్ ట్రేడ్ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది మరి కొద్ది గంటల్లో తెలియనుంది.