ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న నాలుగు సినిమాలలో ‘బ్రో’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తప్ప మిగిలిన రెండు సినిమాలు ‘#OG’ మరియు ‘హరి హర వీరమల్లు’ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్నవి అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు చిత్రాల కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా #OG చిత్రం అయితే రోజు రోజుకి అంచనాలను పెంచేస్తూ ఉంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికీ రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి, మూడవ షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ మీద ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న సంగతి కాసేపటి క్రితమే మూవీ టీం అధికారికంగా ప్రకటించారు.
బాలీవుడ్ లో రొమాంటిక్ హీరో గా ఇమ్రాన్ హష్మీ కి మంచి క్రేజ్ ఉంది. ఈయన నటించిన సినిమాలు అప్పట్లో ప్రభంజనం సృష్టించి , ఇతనిని బాలీవుడ్ యూత్ ఐకాన్ గా నిలబెట్టాయి. ఇప్పటికీ కూడా ఆయనకీ ఆ క్రేజ్ బాలీవుడ్ లో అలాగే ఉంది, అలాంటి స్టార్ ఇప్పుడు #OG మూవీ లో చేస్తుండడం , ఈ చిత్రానికి బాలీవుడ్ లో బలం పెంచినట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నందుకు గాను ‘ఇమ్రాన్ హష్మీ’ 30 కోట్ల రూపాయిల పారితోషికం అందుకుతున్నట్టు సమాచారం.
ఇది ఆయన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అట. ఈ సినిమాతో పాటు ఆయన ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘టైగర్ 3 ‘ చిత్రం లో కూడా విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో ఆయన పారితోషికం కేవలం 20 కోట్లు మాత్రమే, #OG లో మరో పది కోట్లు అదనంగా ఇస్తామని ఆఫర్ ఇవ్వడం తో వెంటనే తన కాల్ షీట్స్ ని ఇచ్చేసాడు ఇమ్రాన్. మరి పవన్ కళ్యాణ్ – ఇమ్రాన్ హష్మీ మధ్య యుద్ధం ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.
Yudham modalupettadaniki nenu vastuna!
— Emraan Hashmi (@emraanhashmi) June 15, 2023
and excited to be a part of #OG, very glad to be working along with @PawanKalyan Garu and with Director @sujeethsign brilliance. Thankyou #Danayya Garu and @Ashwiinmani @DVVMovies pic.twitter.com/0zLKzFImGt