1 నేనొక్కడినే.. దోచేయ్ చిత్రాలతో తెలుగు తెరకు పరిచయమైన కృతి.. ఇప్పుడు మరోసారి ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి.. ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తొలిసారిగా ప్రభాస్తో కలిసి పనిచేయడం.. ఆదిపురుష్ షూటింగ్ జర్నీ గురించి చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ సందడి నెలకొంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు సినీప్రియులు. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ మూవీలో రాముడిగా ప్రభాస్.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుండగా.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించున్నారు.
“ప్రభాస్ చాలా రిజర్డ్వ్ అని విన్నాను.. కానీ అదేం కాదు.. అతను చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎదుటివారిని గౌరవిస్తారు. మొదట్లో మాట్లాడేందుకు చాలా సిగ్గుపడేవాడు. నేను తొలిసారి నటించిన తెలుగు సినిమా గురించి మాట్లాడటం ప్రారంభించాను.. ఆ తర్వాత మనకు రాని భాషలో నటించడం చాలా కష్టమని నాకు తెలియదు అని చెప్పాను.. ఇక ఆ తర్వాతే ప్రభాస్ నాతో మాట్లాడారు. తను చాలా ఒపెన్. సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయేవారు.అంతేకాదు.. తను కళ్లతోనే తన భావాలను వ్యక్తం చేస్తాడు. అదిపురుష్ సినిమాలో రాఘవుడిగా ప్రభాస్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేను” అంటూ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. గతంలో ప్రభాస్, కృతి సనన్ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్ పై అప్పట్లోనే స్పందించింది కృతి. ఇద్దరం మంచి స్నేహితులము మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. భారీ అంచనాలు నెలకొన్న ఆదిపురుష్ సినిమా జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కాబోతుంది.