సాధారణంగా హీరోయిన్లు అంటేనే ఫిట్ గా ఉంటారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం ఫిట్ నెస్ ఫ్రీక్స్ ఉంటారు. వీళ్లు ఎక్కడికి వెళ్లినా.. జిమ్.. ఎక్సర్సైజ్ చేయకుండా ఉండలేరు. ఇక డైట్ ను కచ్చితంగా ఫాలో అవుతుంటారు. వీళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. ఒక్కరోజు జిమ్ కు వెళ్లకపోయినా.. ఆరోజంతా ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతుంటారు. టాలీవుడ్ లో అలాంటి హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా భాటియా ముందుంటారు. ఈ ముద్దుగుమ్మలు టైం దొరికితే చాలు జిమ్ లోకి వెళ్లి కసరత్తులు చేస్తుంటారు.

ముఖ్యంగా తమన్నా ఫిట్ నెస్ ఫ్రీక్. ఈ మిల్కీ బ్యూటీ బాడీ చూస్తేనే అర్థమవుతుంది. ఆ వొంపులు.. సొంపులకు కుర్రాళ్లు ఫిదా అవుతుంటారు. ఈ భామ గంటలు గంటలు జిమ్ లో గడుపుతూ తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ తన జిమ్ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియోలో ఇంటెన్స్ వర్కవుట్ చేసిన తమన్నా.. కాస్త సేదతీరడానికి అలా ఫ్లోర్ పై పడుకుంది. అక్కడికి వచ్చిన తన ట్రైనర్ తో కాసేపు ముచ్చటించింది. తన జిమ్ కష్టాలను చెప్పుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమన్నా వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ తన ఫిట్ నెస్ కోసం పడుతున్న కష్టం చూసి తెగ ఫీల్ అయిపోతున్నారు. ఆ మాత్రం ఫిజిక్ కి ఈ మాత్రం వర్కవుట్ అవసరమేనంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక తమన్నా సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ లో నటిస్తోంది. ఇక ఈ భామ తన ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ పైనే పెట్టింది. బీ టౌన్ లో వరుస సినిమాలు.. వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ భామ బీ టౌన్ లో లస్ట్ స్టోరీస్-2లో నటించింది. ఇటీవలే ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సిరీస్ లో తమన్నా.. బోల్డ్ సీన్స్ లో కనిపించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.