ఈమధ్య కాలం లో డివైడ్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టి, కమర్షియల్ గా సక్సెస్ ని సాధించిన చిత్రం ‘బిచ్చగాడు 2’. 2016 వ సంవత్సరం లో విడుదలైన బిచ్చగాడు సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ నుండే ఎదో కొత్త తరహా చిత్రం అన్న విధంగా జనాలకు అనిపించింది. కానీ సినిమా విడుదలైన తర్వాత మాత్రం కంటెంట్ పరంగా అంచనాలను అందుకోలేకపోయింది.
ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయి లో లేదు, కథ గాడి తప్పింది అనే టాక్ వచ్చింది. కానీ బిచ్చగాడు సినిమాకి ఉన్న బ్రాండ్ ఇమేజి వల్ల , ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టుతో ఈ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. తెలుగు మరియు తమిళ భాషలకు కలిపి 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీస్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా ఆరు కోట్ల రూపాయలకు జరిగింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఒక చిన్న సినిమాకి ఇది రికవర్ చెయ్యడం కాస్త కష్టమైన టాస్క్, కానీ బిచ్చగాడు సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి ఫుల్ రన్ లో పది కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. అంటే ఈ సినిమాని కొన్న బయ్యర్స్ కి నాలుగు కోట్ల రూపాయిల లాభాలు అన్నమాట.
తమిళం లో బిచ్చగాడు 2 సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందా లేదా అనే సందేహం ట్రేడ్ లో ఉండేది. కానీ అక్కడ కూడా ఈ సినిమా ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ సాధించింది. మొత్తం మీద 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో 18 కోట్ల రూపాయిల షేర్ ని రెండు వెర్షన్స్ కి కలిపి రాబట్టింది.