ప్రస్తుతం సినీవర్గాల్లో నటుడు సిద్దార్థ్, హీరోయిన్ అతిథి రావు హైదరీ రిలేషన్షిప్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉంటున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే మొదట్లో ఇదంతా పుకార్లే అనుకున్నారంతా కానీ తర్వాత చాలా ప్రైయిట్ కార్యక్రమాల్లో సిద్దార్థ్, అతిథి కలసి కనిపించడం, అలాగే సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ కలసి రీల్స్ చేయడం వంటివి చూసి వీరిద్దరూ డేటింగ్ లోనే ఉన్నారని కంఫర్మ్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఇటీవల ఈ విషయంపై అతిథిని ప్రశ్నించగా చాలా తెలివిగా సమాధానం చెప్పింది. అసలు విషయాన్ని దాటవేసింది. కానీ వీరిపై రిలేషన్షిప్ పై వార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ విషయంపై సిద్దార్థ్ క్లారిటీ ఇచ్చాడు.
భారతీయ సంస్కృతిలో అతిథి దేవో భవ అంటారు. అయితే హీరో సిద్ధార్థ్ ఒక సందర్భంలో అతిథి దేవో భవ అనడానికి బదులు అదితి దేవో భవ అని అన్నాడు. తద్వారా తన డేటింగ్ విషయాన్ని చెప్పకనే చెప్పాడు.బఅసలీ అదితి దేవో భవ ఏంటో చూస్తే… కొన్నాళ్లుగా సిద్ధార్థ్, అందాలభామ అదితి రావు హైదరీల చెట్టాపట్టాలేసుకుని షికార్లు చేస్తుండడం తెలిసిందే. తాము ప్రేమలో ఉన్నామని వారిద్దరిలో ఒక్కరూ ప్రకటించకపోయినా, వాళ్ల సాన్నిహిత్యం చూస్తే ఎవరైనా లవ్ అనుకోవాల్సిందే! ఇటీవల ఓ టెలివిజన్ షోకి హాజరైన సిద్ధార్థ్ కు ఓ ప్రశ్న ఎదురైంది. లైఫ్ లాంగ్ మీతో కలిసి డ్యాన్స్ చేయాలనుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అని యాంకర్ ప్రశ్నించించింది. అందుకు సిద్ధార్థ్ విచిత్రంగా బదులిచ్చాడు. “మీ ఊరిలో అదితి దేవో భవ అంటారు” అంటూ ‘అదితి’ పేరు వచ్చేలా పరోక్షంగా వెల్లడించాడు.
ఇక సిద్దార్థ్, అతిథి రావు హైదరీ డేటింగ్ గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య వీరిద్దరూ కలసి ఎక్కువగా రీల్స్ చేస్తున్నారు. ప్రైవేటు కార్యక్రమాలకు కూడా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. ఇటీవల జరిగిన హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు కూడా ఇద్దరూ కలసి వెళ్లారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇద్దరూ ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా అతిథి సిద్దార్థ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఇద్దరూ కలసి ఉన్న వీడియోను షేర్ చేయడంతో వీరి ప్రేమ వ్యవహారం చర్చనీయాంశమైంది. సిద్దార్థ్, అతిథి ఇద్దరూ కలసి ‘మహా సముద్రం’లో నటించారు.