మెగా ఫ్యామిలి ఇంట్లో కొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమికులు అని రూమర్ ఉన్న వార్త నిజమైంది. అందరూ అనుకున్నట్టే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది. వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్ మెంట్ జూన్ 9న చాలా సింపుల్గా జరిగింది. కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక ఈ జంట దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. లావణ్య, వరుణ్ ఇద్దరు కలిసి మిస్టర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ సినిమా సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ఈ విషయాన్ని లావణ్య స్వయంగా వెల్లడించటంతో క్లారిటీ వచ్చేసింది.
అయితే లావణ్యకు వరుణ్ని చేసుకోమని సలహా ఇచ్చింది మాత్రం అల్లు అరవింద్ అని సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తోంది. దీనికి సంబంధించిన ప్రూఫ్ ఇదేే అంటూ ఓ వీడియో సైతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. చావు కబురు చల్లగా అనే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో లావణ్య వేదికపై మాట్లాడుతుండగా అల్లు అరవింద్ ఆమె దగ్గరకి వచ్చాడు. వెంటనే మైక్ లాక్కొని “తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నావ్. ఇక్కడే తెలుగు అబ్బాయి చూసుకొని చక్కగా పెళ్లి చేసుకో” అని సూచించారు. ఇప్పుడు ఏకంగా అమ్మడు మెగా కోడలు కాబోతుంది. ఈ విషయాన్ని తన అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “మై డాడ్ ఈస్ విజనర్” అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం గాంఢీవధారి అర్జున చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు వరుణ్.. పలాస ఫేమ్ కరుణ కుమార్తో మరో చిత్రాన్ని చేస్తున్నాడు.