ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో భారీ అంచనాలను ఏర్పాటు చేసిన సినిమా ‘ప్రాజెక్ట్ K ‘. కాన్సెప్ట్ పోస్టర్స్ దగ్గర నుండే ఈ సినిమా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా అమితాసక్తిని రేపింది. ఈ సినిమా టైం ట్రావెల్ మీద బేస్ చేసుకొని తీస్తున్నది. టైం ట్రావెల్ ద్వారా మహాభారతం లోని కురుక్షేత్ర యుద్ధం కాలానికి వెళ్లే ప్రక్రియే ‘ప్రాజెక్ట్ కురుక్షేత్ర’ అలియాస్ ‘ప్రాజెక్ట్ K’.
ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని పెట్టి నిర్మిస్తున్నాడు. మహానటి ఫేమ్ నాగఅశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దీపికా పడుకొనే ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఇక పోతే ఈ సినిమాలో నెగటివ్ రోల్ కోసం సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన కమల్ హాసన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సోషల్ మీడియా లో గత కొంత కాలం నుండి వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ నాగ అశ్విన్ కమల్ హాసన్ ని స్వయంగా కలిసి ఎంతో రిక్వెస్ట్ చేసాడట. నిర్మాతలు కూడా సంప్రదింపులు జరిపారు,30 రోజుల కాల్ షీట్స్ అవసరం అవుతాయి అని, ఆ 30 రోజులకు వంద కోట్ల రూపాయిలు ఇస్తామని అంటున్నారట. కానీ కమల్ హాసన్ ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
నిర్మాతలు అందుకు ఒప్పుకున్నారని, కమల్ హాసన్ కూడా డీల్ కి ఓకే చెప్పి కాల్ షీట్స్ కూడా ఇచ్చేసాడని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన బయటకి రాబోతుందట. ప్రభాస్, అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్ , దీపికా పడుకొనే ఇలా ఇండియా కి చెందిన దిగ్గజ నటులందరూ ఒకే సినిమా కోసం పనిచెయ్యడం చరిత్ర లో ఇదే తొలిసారి, అనుకున్న విధంగా పాజిటివ్ టాక్ వస్తే మినిమం 20 సంవత్సరాల పాటు ఎవ్వరూ ముట్టుకోలేని రికార్డ్స్ పెడుతుంది ఈ చిత్రం.