పవన్ కళ్యాణ్ కే ఝలక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. షూటింగ్‌ మధ్యలోనే..!

- Advertisement -

రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘కెరటం’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆమె తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగులో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రకుల్. అయితే ఈ భామకు తెలుగులో ప్రస్తుతం పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. ఆమె నటించిన తెలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్స్ రావటంతో ఆ తర్వాత అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా ఉండగా రకుల్‌కు పవన్ కల్యాణ్ బ్రో సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రకుల్‌ పవన్‌కు ఝలక్‌ ఇచ్చిందట.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

అసలు విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ వర్క్ దాదాపు పూర్తి కావస్తోంది. ఇక రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓ పాటని స్పెషల్ సాంగ్‌గా ప్లాన్ చేశారట దర్శక నిర్మాతలు. ఈ పాట ఇద్దరు హీరోల మీద ఉంటుందట. ఈ పాటలో డాన్స్ చేసేందుకు మొదట తమన్నా, శృతిహాసన్, శ్రీలీల ఇలా చాలా పేర్లు పరిశీలించారు. శ్రీలీల ఆల్‌మోస్ట్‌ ఓకే అనుకున్నారు. కానీ ఆమెకు డేట్స్ కుదరకపోవటంతో రకుల్‌ని ఫైనల్ చేశారు.

rakul preet

రకల్ కూడా ఓకే అనడంతో.. షూట్‌కు ప్లాన్ చేశారట దర్శక నిర్మాతలు. అయితే పాట షూట్‌కు రెండు రోజుల ముందు రకుల్ తనకు డేట్‌లు అడ్జస్ట్ కావడం లేదని షాక్ ఇచ్చిందట. షూటింగ్‌ ప్రారంభమయ్యేప్పుడే ఆమె ఈ విషయం చెప్పటంతో చిత్ర బృందం ఖంగుతిన్నారట. దీంతో ఇక మరో హీరోయిన్‌ను వెతికే పనిలో పడ్డారట టీమ్. ఈసినిమా జూలై 28న విడుదలకు రెడీ అవుతోంది.

- Advertisement -
rakul preet singh

ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది. రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఇటీవలే ఈసినిమా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here