గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రూమర్ లాగ విస్తృతంగా ప్రచారమైన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వార్త ఇప్పుడు నిజం కానుంది. రెండు ఈ జంట హైదరాబాద్ లో మెగా కుటుంబం మరియు కొంతమంది సినీ ప్రముఖుల మధ్య జరగబోతుంది. అయితే ఈ నిశ్చితార్ధ వేడుకకు మరియు పెళ్లి వేడుకకు వరుణ్ తేజ్ చెల్లి నిహారిక కొణిదెల హాజరు కావడం లేదా? , అనే సందేహం ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.
విషయం లోకి వెళ్తే నిహారిక కొణిదెల మరియు చైతన్య విడిపోయినప్పటి నుండి నాగబాబు మరియు మెగా ఫ్యామిలీ నిహారిక పై చాలా కోపం గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈమధ్య కాలం లో ఆమె నాగబాబు కుటుంబం తో కానీ, చిరంజీవి కుటుంబం తో కానీ కలిసినట్టు దాఖలాలు కూడా లేవు. అంటే ఈమె నిజంగానే మెగా కుటుంబానికి దూరంగా ఉన్నట్టేనా అని చెవులు కొరుక్కుంటున్నారు నెటిజెన్స్.
నిహారిక మరియు చైతన్య పెళ్లి ని ఎంత ఘనంగా జరిపించారో మన అందరికీ తెలిసిందే. ‘నిశ్చయ్’ అనే ట్యాగ్ ని క్లిక్ చేస్తే ఈ వివాహ మహోత్సవం ఎంత అద్భుతంగా జరిగిందో వీడియోల రూపం లో మనకి కనిపిస్తుంది. ఈ పెళ్లి పూర్తి అయ్యే వరకు లావణ్య త్రిపాఠి నిహారిక తోనే ఉన్నింది. దగ్గరుండి మరీ ఆమె పెళ్లి పనులన్నీ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే లావణ్య త్రిపాఠి నిహారికకు బెస్ట్ ఫ్రెండ్.
ఆమె వల్లనే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కలిశారట. అలాంటిది ఇప్పుడు నిహారిక లావణ్య పెళ్ళికి రాకపోతే సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. మరోపక్క నాగబాబు నిహారికకు, నువ్వు మళ్ళీ గడప తొక్కితే అది చైతన్య తో కలిసే తొక్కాలి, లేకుంటే మా దరిదాపుల్లోకి కూడా రాకు అని చాలా కఠినంగా నిహారికకు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె మణికొండ లో నివాసం ఉంటుంది.