టాలీవుడ్​ చరిత్రలో తొలిసారిగా ఆ రికార్డ్‌ సృష్టించనున్న బాలయ్య!

- Advertisement -

నందమూరి అభిమానులకు భారీ గుడ్‌న్యూస్. NBK108 మూవీ నుండి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు చిత్ర బృందం. అనిల్ రావిపూడితో కలిసి బాలకృష్ణ చేస్తున్న మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా సినిమాకు సంబంధించిన ఈ అప్డేట్స్ ఇవ్వనున్నారు.

NBK108
NBK108

ఇందుకోసం చిత్ర బృందం భారీగానే ప్లాన్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరు చెయ్యని విదంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 108 ప్రాంతాల్లో 108 భారీ హోర్డింగ్స్ తో ఈ మాస్ టైటిల్‌ను జూన్ 8న లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ తరువాత బాలయ్య నుండి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ తాజా వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో యువ నటి శ్రీలీల నటిస్తోంది. శ్రీలీల ఈ చిత్రంలో బాలయ్య స్నేహితుడు శరత్‌కుమార్‌ కూతురిగా కనిపించబోతుందని సమాచారం. ఇప్పటివరకు రాయలసీయ యాసలో అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన బాలయ్య.. తాజా ప్రాజెక్ట్‌లో తెలంగాణ యాసలో సరికొత్త వినోదాన్ని అందించబోతున్నాడని చెప్పాడు అనిల్ రావిపూడి. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్‌ బంప్స్‌ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందించిన ఎస్‌ థమన్‌ మరోసారి సంగీతం అందించేందుకు రెడీ అవుతున్నాడు.

- Advertisement -

ఇప్పటికే ఉగాది కానుకగా విడుదల చేసిన బాలయ్య లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలయ్య గెటప్, కోర మీసంతో ఉన్న లుక్‌కు అభిమానులు ఫిదా అవతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ. 80 కోట్ల వరకు అమ్ముడు పోయినట్టు సమాచారం. మరోవైపు డిజిటల్ హక్కులు రూ. 40 కోట్లకు అమెజాన్ ప్రైమ్ ఐదు భాషలకు సంబంధించిన డీల్ పూర్తైయినట్టు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here