ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోన్న హీరోయిన్ సమంత. దక్షిణాన అగ్రకథానాయికగా ఎదిగిన సమంతకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుందని చెప్పవచ్చు. వ్యక్తిగత విషయాల వల్ల సమంత మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అటు నాగచైతన్యతో విడాకులు, ఇటు అనారోగ్య సమస్యలతో ఇప్పటికే సమతమతమవుతున్న సమంతకు ఇది పెద్ద సమస్యగా మారింది. వీటన్నింటినీ అధిగమించి పట్టుదలతో ముందుకు సాగుతోంది సమంత. ఈక్రమంలో తన శరీరాకృతిపై మరింత శ్రద్ధ వహిస్తోంది.

గ్లామర్‌గా కనిపించినంత కాలమే హీరోయిన్స్‌కి డిమాండ్. ఒకసారి షేప్ అవుట్ అయితే అంతే సంగతులు. ఆడియెన్స్‌తో పాటు దర్శకనిర్మాతలు వారిపై ఇంట్రెస్ట్ తగ్గిస్తారు. కొత్తవారిపై మెుగ్గుచూపుతూ అటుగా మళ్లిపోతారు. అందుకే కథానాయికలు ఎప్పుడు స్లిమ్‌గా, గ్లామర్‌గా కనిపించేందుకు శ్రమిస్తుంటారు. ఫుడ్ డైట్ పాటిస్తూ జిమ్‌లో గంటలకొద్ది కసరత్తులు చేస్తుంటారు. ఈ విషయంలో సమంత యమ యాక్టివ్‌గా ఉంటారు. వ్యాయామం, యోగా చేస్తూ శరీరాన్ని అదుపులో ఉంచుతుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సామ్ మరో వర్కౌట్ వీడియోను షేర్ చేసింది.

ఆ వీడియోలో సామ్ కాఫ్ మజిల్స్(కాలి పిక్కలు) షేప్ అండ్ సైజ్ పెంచేందుకు ఓ కఠినమైన ఎక్సర్సైజ్ చేస్తోంది. ఆది కూడా వంద రిపీట్స్. దానికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేసింది. కాఫ్ మజిల్స్ షేప్, సైజ్ కోసం సమంత తన ట్రైనర్‌తో కలిసి ఆ స్థాయిలో కష్టపడుతున్నారు. ఈ వీడియోను ఇంటర్నెట్లో షేర్ చేయటంతో తెగ వైరల్ అవుతోంది. ఆమె డెడికేషన్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం సమంత శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో ఆమె విజయ్ దేవర కొండ సరసన నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ టర్కీలో జరుగుతోంది. మరోవైపు సమంత సిటాడెల్ ఇండియన్ వర్షెన్లోనూ నటిస్తోంది. కాగా ఆమెకు హాలీవుడ్ ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. ఇప్పటిచే చెన్నై స్టోరీ అంటూ ఓ ఆఫర్ చేజిక్కించుకుంది. ఇవి కాకుండా మరిన్ని ఆఫర్లు కూడా వస్తున్నట్లు సమాచారం.