తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. టాలీవుడ్ లో తొలి సినిమా ‘నేను శైలజ’తోనే ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. మరోవైపు కీర్తి పెళ్లి చేసుకోబోతోందంటూ ఇటీవలి కాలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాంటిది ఏమీ లేదని ఇప్పటికే కీర్తి, ఆమె కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే చెన్నైలో జరిగిన మామన్నన్
ఆడియో రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న కీర్తి సురేష్‌కు మరోసారి పెళ్లి ప్రశ్న ఎదురైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేష్ ని అక్కడి మీడియా పెళ్లి వార్తలపై స్పందించాల్సిందిగా కోరింది. అంతే కాకుండా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అని ప్రశ్నించగా కీర్తి సురేష్ అసహనం వ్యక్తం చేశారు. పెళ్లి వార్తలపై మాట్లాడుతూ `నా పెళ్లికి సంబంధించిన వస్తున్న వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను.
మీరంతా పెళ్లి గురించే ఎందుకు అడుగుతున్నారు?. నా పెళ్లిపై మీరెందుకు అంత ఆసక్తి చూపుతున్నారు?.. నా వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నాక నేనే స్వయంగా ప్రకటిస్తా. దీని గురించి ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ప్రెస్ మీట్లో ప్రశ్నించాల్సిన పని లేదు` అంటూ కీర్తి సురేష్ పెళ్లి వార్తలపై అసహనం వ్యక్తం చేసింది. కీర్తిసురేష్ స్పందించిన తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ బిజీ బిజీగా గడిపేస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న భోళా శంకర్
లో నటిస్తోంది. ఇందులో తమన్నా హీరోయిన్ గా కనిపించనుండగా, కీర్తి సురేష్ మాత్రం చిరుకు సోదరిగా నటిస్తోంది. ఆగస్టు 11న విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. జూన్ 4న ఫస్ట్ లిరికల్ వీడియోని విడుదల చేస్తూ భోళా మేనియా
ని మొదలు పెట్టబోతున్నారు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ఈ మూవీతో పాటు తమిళలో మూడు సినిమాల్లో నటిస్తోంది.