మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లో తన తోటి నటీనటులతో ఎంతో స్నేహం గా ఉంటూ వచ్చే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్స్ తో ఆయన చాలా సరదాగా ఉండేవారు, అలా ఉండడం వల్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వస్తుందని చిరంజీవి అభిప్రాయం. అందుకే ఆయన సెట్స్ లో ఉన్నంతకాలం సరదాగా తన కుటుంబ సభ్యులతో ఎలా అయితే ఇంట్లో ఉంటాడో, అలాగే ఉండేవాడట.
అయితే చిరంజీవి తో ఇద్దరు హీరోయిన్లు మాత్రం సరిగా మాట్లాడేవారు కాదు, కెరీర్ ప్రారంభం లో ఆయనకీ మాధవి అనే హీరోయిన్ తో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆమెతో కలిసి ఈయన చాలా సినిమాల్లో నటించాడు కానీ, సెట్స్ లో పెద్దగా మాట్లాడుకునేవారు కాదట. అయితే ఎప్పుడు తన స్నేహితురాలు సురేఖ ని చిరంజీవి పెళ్లాడాడో, అప్పటి నుండి మాధవి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయింది. ఇక చిరంజీవితో సమస్య ఉన్న మరో హీరోయిన్ నగ్మా.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా ‘ఘరానా మొగుడు’ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నగ్మ పాత్రకి తొలుత విజయశాంతిని అనుకున్నారు, కానీ ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో అప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నగ్మ ని తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ చిరంజీవి ఆమెతో కలిసి ‘ముగ్గురు మొనగాళ్లు’ అనే చిత్రం లో నటించాడు. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.ఇది కాసేపు పక్కన పెడితే నగ్మ కి అప్పటికే రెండు మూడు హిట్ సినిమాలు పడి స్టార్ స్టేటస్ కి చేరుకుంది,ఆ స్టార్ స్టేటస్ కారణంగా వచ్చిన అహంకారం ని సెట్స్ లో చూపించేది ఈమె.
ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన చిరంజీవి తమ్ముడు నాగబాబు ని డేట్స్ విషయం లో ముప్పు తిప్పలు పెట్టిందట.ఈమె బిల్డప్ మరియు పొగరుని చిరంజీవి గమనించాడు, అయ్యినప్పటికీ కూడా రిక్షావోడు సినిమాలో హీరోయిన్ గా ఈమెని తీసుకున్నాడు. ఈ షూటింగ్ జరుగుతున్నంత సేపు కూడా ఆమె ఇలాగే తలపొగరు చూపిస్తూ వచ్చిందట, ఇక సాంగ్స్ చిత్రీకరణ దగ్గరకి వచ్చేసరికి ఈమె ఆగడాలను భరించలేక పోయిన చిరంజీవి తన మేకప్ రూమ్ కి పిలిచి బాగా మందలించాడట. ఆమె తలబిరుసుగా మాట్లాడేలోపు చిరు కి కోపం వచ్చి చెంప దెబ్బ కూడా కొట్టాడని అప్పట్లో ఒక టాక్ ఉండేది. అలా మందలించినా కూడా ఆమె ఎలాంటి మార్పు రాకపోవడం తో, ఇక ఈమెతో జీవితం లో కలిసి నటించకూడదు అని నిరాయించుకున్నాడట చిరంజీవి.