బాలివుడ్ బ్యూటీ కియారా అద్వాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. రెండు మూడు తెలుగు సినిమాల్లో నటించింది.. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడుకు మొదటి సినిమాతో మంచి క్రేజ్ దక్కింది.. ఆ తర్వాత సక్సెస్ లు పలకరించలేదు.. దాంతో మళ్లీ బాలివుడ్ కు వెళ్లింది.. బాలివుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రానిస్తుంది.. ఇటీవలే తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.. రాజస్థాన్‌లో ఖరీదైన ఫాలెస్ లో అత్యంత వైభవంగా ఈ ప్రేమజంట వివాహం జరిగింది. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో చూశాం..

ఇది ఇలా ఉండగా.. ఈ అమ్మడుకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.. కారు విలువ దాదాపు భారత మార్కెట్‌లో రూ.3 కోట్ల విలువ ఉంటుందని సమాచారం.. మొన్నీమధ్య ఈ అమ్మడు తన భర్తతో కలిసి జపాన్ టూర్‌కు వెళ్లి భామ ఇండియాకు తిరిగొచ్చింది. ఆ కారును మే 26న తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది.. దాంతో కారు కొన్న విషయం ఇండస్ట్రీలో షికారు చేస్తుంది..

ఇకపోతే పెళ్లి తర్వాత కూడా గ్యాప్ లేకుండా బిజీగానే ఉంది.. అటు బాలివుడ్ తో పాటు ఇటు తెలుగులో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది.. ప్రస్తుతం. ఈ అమ్మడు తెలుగు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తుంది.. గేమ్ ఛేంజర్ చిత్రంలో కనిపించనుంది. కియారా నటించిన సత్యప్రేమ్ కి కథ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేసిన సినిమాలో కూడా నటించింది.. ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది…