‘బంగార్రాజు’ చిత్రం వరకు అక్కినేని నాగ చైతన్య వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకొని అక్కినేని అభిమానుల్లో ఫుల్ జోష్ ని నింపాడు. కానీ ఎప్పుడైతే ‘థాంక్యూ అనే చిత్రం చేసాడో, అప్పటి నుండి నాగ చైతన్య కెరీర్ డౌన్ అయిపోయింది. ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో నాగ చైతన్య మార్కెట్ మొత్తం మటాష్ అయ్యింది. రీసెంట్ గా విడుదలైన ‘కస్టడీ’ అనే చిత్రం కూడా బోల్తా కొట్టింది.
కెరీర్ ఇంత దీనైమైన స్థితికి వెళ్లిపోవడం తో తదుపరి చిత్రం ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయం లో నాగ చైతన్య కి గీత ఆర్ట్స్ సంస్థ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘కార్తికేయ 2’ వంటి భారీ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత చందు మొండేటి గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ పెట్టబోతున్నారట, పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నాగ చైతన్య హీరో గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో నాగ చైతన్య సముద్రం చేపలు పట్టే జాలరి పాత్రని పోషిస్తున్నాడు. గుజరాత్ కి చెందిన ఒక బోట్ డ్రైవర్ నిజజీవితాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ చందు మొండేటి. ఈ కథలో ఎన్నో ఊహకందని మలుపులు ఉంటాయట.
ఇందుకోసం గత ఏడాది నుండి చందు మొండేటి మరియు టీం ఫిషర్ మ్యాన్ లైఫ్ స్టైల్ ని బాగా రీసెర్చ్ చేసి ఈ స్క్రిప్ట్ ని డెవలప్ చేసాడట. నాగ చైతన్య కెరీర్ లో ఈ సినిమా ఒక ల్యాండ్ మార్కు గా నిలిచిపోతుందని, ఈ చిత్రం తో నాగ చైతన్య కూడా పాన్ ఇండియన్ స్టార్ గా నిలుస్తాడని అంటున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు అధికారికంగా తెలియచెయ్యబోతున్నారు మేకర్స్.