ఇండస్ట్రీ లో పైకి రావాలంటే టాలెంట్ మరియు అదృష్టం ఉంటే సరిపోదు, క్రమశిక్షణ మరియు నిజాయితీ కూడా ఉండాలి. అవి లేకపోతే ఇండస్ట్రీ లో మనుగడ సాగించడం కష్టం. దీనికి రీసెంట్ ఉదాహరణ ప్రముఖ డైరెక్టర్ పరుశురాం. ఇతగాడు మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ఆంజనేయులు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు.
తొలిసినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ, టేకింగ్ పరంగా పర్వాలేదు, కుర్రాడిలో టాలెంట్ ఉంది అని నిర్మాతలకు అర్థం అయ్యేలా చేసాడు. ఆ తర్వాత నారారోహిత్ తో ‘సోలో’ అనే సూపర్ హిట్ అందుకున్నాడు. అలా మెల్లిగా సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన ,’శ్రీరస్తు శుభమస్తు’ అనే చిత్రం ద్వారా అల్లు క్యాంప్ లోకి అడుగుపెట్టాడు. ఇదే ప్రొడక్షన్ హౌస్ లో ఆయన ‘గీత గోవిందం’ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా తర్వాత ఆయనకీ టాలీవుడ్ లో అవకాశాల వెల్లువ కురిసింది, ఏకంగా మహేష్ బాబు తో ‘సర్కారు వారి పాట’ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది. కానీ ఆ సినిమా కమర్షియల్ గా యావరేజి గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆయన గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు, ఇదే మాట నాగ చైతన్య మరియు 14 రీల్స్ సంస్థ ప్రాజెక్ట్ కి కూడా ఇచ్చాడు. కానీ ఈ రెండు మాటలను గాలికి వదిలేసి, దిల్ రాజు కి కమిట్మెంట్ ఇచ్చేసాడు. ఈ చిత్రం లో హీరో గా విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. మరోపక్క ఇచ్చిన మాటని పక్కన పడేసి తమ కాలాన్ని వృధా చేసినందుకు గాను అల్లు అరవింద్ మరియు నాగ చైతన్య బహిరంగంగానే రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఈ డైరెక్టర్ ఎంత దరిద్రుడో చెప్పుకొచ్చారు.
అందరి దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఇలా మోసం చేస్తున్నాడు అంటూ రీసెంట్ గా 14 రీల్స్ అధినేత అనిల్ సుంకర ఆరోపించాడు. ఈ చిత్రం కోసం తన చేత 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడని, ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యిపోయాడని, తాను ఖర్చు చేసిన డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలి, లేదా విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమాలో పార్టనర్ షిప్ ఇప్పించాలి అని అనిల్ సుంకర పట్టుబట్టాడట. ఇన్నాళ్ల సినిమా ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కూడా ఇంత చీప్ గా ప్రవర్తించలేదు.ఇతగాడిని ఇండస్ట్రీ నుండి బ్యాన్ చెయ్యాలి అంటూ కొంతమంది ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.