తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు స్నేహ. సినీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఇప్పటికీ అంతే గ్లామర్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఫ్యామిలీ సినిమాలతో మెప్పిస్తూనే తమిళంలోని స్టార్ హీరోలందరితోనూ జోడీ కట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్నతనంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.
ప్రముఖ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే.. 2012లో నటుడు ప్రసన్నను ప్రేమించి మరీ వివాహం చేసుకోగా వీరికి ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఇకపోతే ఇంతవరకు స్నేహ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆమె కుటుంబం, బాల్యం గురించి ఎవరికీ చెప్పలేదు. ‘మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలం. నేను చివరి దాన్ని. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. నాకు బదులుగా మగ పిల్లాడు పుట్టాలని మా బామ్మ కోరుకుంది. నేను పుట్టినప్పుడు నా ముఖం చూసేందుకు కూడా రాలేదు. ఆడపిల్లలమంతా ఎంతో వివక్ష నడుమ పెరిగాం. మా పెద్దన్నయ్య నన్నెంతో ఇబ్బంది పెట్టేవాడు.
పనులన్నీ మాతోనే చేయించేవారు. ప్రశ్నిస్తే మేం మగాళ్లమంటూ పురుషాధికారం చూపేవారు’ అంటూ చెప్పుకొచ్చింది. స్నేహ వివాహం చేసుకుంది కూడా ఓ తమిళ నటుడే. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ఇంకా అంతే కాదు తన పెద్ద సోదరుడు తనను చాలా ఇబ్బందులు పెట్టాడని అన్ని పనులు కూడా తననే చేయమని ఆదేశించేవాడు అంటూ కన్నీటి పర్యంతం అయింది స్నేహ. ఇక ఈ వీడియో చూసిన వారంతా నువ్వు ఇన్ని కష్టాలు పడి పైకి వచ్చావా అని కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా సమాజం ఇంకా మారాలంటున్నారు.