చిరంజీవి – వెంకటేష్.. టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీస్టార్ర్ర్ మూవీ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకే జనరేషన్ కి చెందిన స్టార్ హీరోలు కూడా కలిసి నటించేస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ , కృష్ణ మరియు శోభన్ బాబు నాటి కాలం లో మల్టీస్టార్ర్ర్ చిత్రాలు రావడం అనేవి చాలా కామన్. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి జనరేషన్ ప్రారంభం అయ్యాక, ఈ మల్టీస్టార్ర్ర్ ట్రెండ్ తగ్గిపోయింది.
మళ్ళీ ఈ మల్టీస్టార్ర్ర్ ట్రెండ్ ని ప్రారంభించిన హీరో విక్టరీ వెంకటేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఆయన నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ పెద్ద హిట్ అవ్వడం తో చిన్నగా మల్టీస్టార్ర్ర్ సినిమాలు ఇండస్ట్రీ లో మొదలయ్యాయి. సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఇప్పటికీ మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే గతం లో ఆయన మెగాస్టార్ చిరంజీవి తో ఒక మల్టీస్టార్ర్ర్ చిత్రం మిస్ అయ్యాడట. ఈ విషయం చాలా మందికి తెలియదు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ లో అమిర్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ‘అందాజ్ అప్నా అప్నా’ అనే మల్టీస్టార్ర్ర్ చిత్రం 1994 వ సంవత్సరం లో విడుదలై బంపర్ హిట్ అయ్యింది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో అమిర్ మరియు సల్మాన్ పోటీ పడి మరీ కామెడీ ని పండించారు. ఈ చిత్రాన్ని అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో రీమేక్ చెయ్యాలని ప్రముఖ డైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ ప్రయత్నం చేసాడు.
ఇద్దరూ కూడా ఒప్పుకున్నారు కానీ, అదే సమయం లో వాళ్లకి వేరే కమిట్మెంట్స్ కూడా ఉండడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక బాగా ఆలస్యం అవ్వడం తో ఈ చిత్రాన్ని చేసిన వృధా ప్రయత్నం అవుతుందేమో అనే అనుమానం తో ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసేసారు. కామెడీ టైమింగ్ లో కింగ్స్ గా పిలవబడే చిరంజీవి మరియు వెంకటేష్ లాంటి హీరోలు ఈ సినిమా చేసి ఉంటే వేరే లెవెల్ లో ఉండేదని అంటుంటారు ట్రేడ్ పండితులు.