కన్నడ సినీ పరిశ్రమ కి గర్వకారణం లాగ నిల్చిన చిత్రం KGF.అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. విడుదలైన ప్రతీ భాషలోనూ బంపర్ హిట్ గా నిలిచి మొదటి భాగం తో సుమారు 400 కోట్ల రూపాయిలను కొల్లగొట్టాడు రాఖీ భాయ్. మన తెలుగు లో ఒక్క కన్నడ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి చాలా కాలమే అయ్యింది.

అప్పుడెప్పుడో ఉపేంద్ర హీరో గా నటించిన కొన్ని సినిమాలు ఇక్కడ బాగా ఆడాయి. మళ్ళీ ఇన్నాళ్లకు ఒక్క కన్నడ చిత్రం తెలుగు లో బంపర్ వసూళ్లను సాధించడం KGF కి మాత్రమే జరిగింది.ఇక ఆ తర్వాత గత ఏడాది వచ్చిన KGF చాప్టర్ 2 చిత్రం ఏకంగా #RRR కంటే ఎక్కువ వసూళ్లను సాధించి సుమారుగా 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

ఇక ఈ సిరీస్ లో హీరో గా నటించిన రాకింగ్ స్టార్ యాష్ కి మామూలు క్రేజ్ రాలేదు. ప్రతీ భాషలోనూ అక్కడి ఆడియన్స్ ఆయనని బాగా దగ్గర చేసుకున్నారు. కానీ ఈ హీరో KGF చాప్టర్ 2 విడుదలై ఏడాది దాటినా, ఇప్పటికీ ఆయన ఒక్క సినిమా షూటింగ్ కూడా ప్రారంభించలేదు. మరో పక్క KGF సిరీస్ కి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో సలార్ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసేసాడు, కానీ యాష్ ఇప్పటి వరకు తన కొత్త సినిమాకి సంబంధించి కనీసం పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించలేదు.

దీనితో ఫ్యాన్స్ కి అసలు యాష్ సినిమాలు చేస్తున్నాడా లేదా అనే సందేహం మొదలైంది. అయితే యాష్ తన తదుపరి చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్ అని, ఇందుకోసం ఆయన JJ పెర్రీ అనే హాలీవుడ్ యాక్షన్ స్టంట్ మాస్టర్ దగ్గర కోచింగ్ కూడా తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో చూడాలి.
