కథానాయకుడిగా అల్లు శిరీష్ ప్రయాణం మిగతా హీరోల కంటే కాస్త భిన్నమైనదని చెప్పాలి. ఆయన క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తుంటారు. డిఫరెంట్ సబ్జెక్టులు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు చేసే అల్లు శిరీష్… ఇటీవల ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అందులో వినోదానికి, నటీనటుల ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు కొత్త సినిమాతో అల్లు శిరీష్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.

అల్లు శిరీష్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా సినిమా ‘బడ్డీ’. ‘బడ్డీ’ ఫస్ట్ లుక్ చూస్తే… అల్లు శిరీష్ తుపాకీ పట్టుకుని కనిపిస్తున్నారు. ఆయన పక్కన టెడ్డీ బేర్ ఉంది. దాని లుక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఈ పోస్టర్ చూస్తే ఆయన బాక్సాఫీస్‌కు గురి పెట్టినట్లు ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఇది చూసిన వారంతా గర్ల్ ఫ్రెండ్ లేక టెడ్డీతో సరిపెట్టుకుంటున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో తాజాగా విడుదలైన గ్లింప్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. అందులోని డైలాగులనే అల్లు శిరీష్ కు ఆపాదిస్తున్నారు. ఏదేమైనా మొత్తం మీద గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. మరి ఈ అల్లు హీరో బొమ్మతో హిట్ కొడతాడో లేదో చూడాలి. అసలే చాలా రోజులైంది ఈ హీరో ఖాతాలో ఒక మంచి కిక్ ఇచ్చే హిట్ పడి.