పవిత్ర లోకేష్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు రూమర్స్ తో ఫెమస్ అవుతుంది.. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఈమె పేరు విమర్షలతో బాగా ఫెమస్ అయ్యింది..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, కన్నడ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర.. గత కొన్నాళ్ల నుంచి ప్రముఖ నటుడు నరేష్ తో సహాజీవనం చేస్తోంది. ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని ఇటీవల మీడియా ముఖంగా వెల్లడించారు. పవిత్రకు ఆల్రెడీ రెండు పెళ్లిళ్లు అయ్యాయి. నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఈయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి..
అయితే, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్నా విషయం తెలిసిందే.. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారన్నా వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..ఇప్పుడు పవిత్ర గురించి ఓ వార్త షికారు చేస్తుంది.. ఈమెకు నరేష్ కన్నా ఎక్కువగా ఓ హీరో అంటే ఇష్టమట.. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పడంతో నరేష్ ను ఎప్పుడు వదిలేస్తుందో అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి..ఇక నరేష్, పవిత్ర జంటగా `మళ్లీ పెళ్లి’ అంటూ ఓ మూవీ చేసిన సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించాడు. మే 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. నరేష్-పవిత్రల రియల్ లైఫ్ స్టోరీనే రీల్ లైఫ్ లో తెరకెక్కించారు. అయితే టీజర్, ట్రైలర్ తో అంచనాలు బాగానే పెంచారు.. కానీ, సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర లోకేష్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తన క్రష్ ఎవరో కూడా బయట పెట్టింది. పవిత్ర క్రష్ మరెవరో కాదు అక్కినేని మన్మథుడు నాగార్జున గీతాంజలి సినిమా చూసినప్పుడు నాగార్జునకు పవిత్ర ఫిదా అయిపోయిందట. నాగార్జునపై పిచ్చి ప్రేమ ఏర్పడిందట. నాగార్జున లాంటి వ్యక్తి భర్తగా రావాలని పవిత్ర ఆశ పడిందట. ఒకప్పుడు నరేష్ కంటే ఎక్కువ నాగార్జునను ఇష్టపడ్డానని.. కానీ, ఇప్పుడు మాత్రం నరేష్ తర్వాతే ఎవరైనా అని పవిత్ర పేర్కొంది. ఇక నటుడిగా ప్రకాశ్ రాజ్ అంటే అభిమానమని.. ఆయనలా అన్ని పాత్రలు పోషించే వారు చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉన్నారని పవిత్ర చెప్పుకొచ్చింది.. మొత్తానికి ఇది విన్న వాళ్లంతా ఓ రెంజులో కామెంట్స్ పెడుతున్నారు..