రాహుల్ రవీంద్రన్ – చిన్మయి దంపతులకు టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ క్యూట్ పెయిర్‌గా గుర్తింపు ఉంది. ఇప్పుడు వారిద్దరూ భార్యభర్తలు కావచ్చు.. ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులు కావచ్చు. పదకొండేళ్ల క్రితం ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు. చెన్నైలోని ఓ డబ్బింగ్ స్టూడియో వారిద్దరి పరిచయానికి వేదికైంది. అప్పటికే చిన్మయి స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్. రాహుల్ రవీంద్రన్ ‘అందాల రాక్షసి’ సినిమా చేస్తూ, లావణ్యకు చెప్పే విషయంలో దర్శకుడి హనూ రాఘవపూడితో చర్చ వచ్చినప్పుడు చిన్మయి డబ్బింగ్ చెబుతుందనే ప్రస్తావన వచ్చింది. చెన్నైలో ‘అందాల రాక్షసి’ స్ర్కీనింగ్ జరిగినప్పుడు మొదటిసారి చిన్మయిని కలిశారు రాహుల్.
తాజాగా వీళ్లిద్దరూ వాళ్ల పరిచయం ప్రేమ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల నుంచి మీటూ మూమెంట్ వరకు వేదిక ఏదైనా, సమస్య ఎలాంటిదైనా చిన్మయి లెక్కే చేయదు. అలాంటి రెబల్ అయిన చిన్మయి.. సాఫ్ట్ పర్సన్ అయిన రాహుల్‌తో లవ్ ఎలా సెట్ అయిందో చాలా మందికి అర్థం కాదు. కానీ వాళ్లు మాత్రం ఎప్పుడూ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. అసలు వీళ్లిద్దరి పెళ్లికి హెల్ప్ చేసింది ఎవరో చెప్పి షాక్ కు గురిచేశారు.
ఇక వీళ్లను కలిపిన వ్యక్తి ఎవరా అన్న ఆడియన్స్‌కు మొత్తానికి ఓ క్లారిటీ దొరికింది. “సందీప్ ఫుల్.. నువ్వు రాహుల్‌ను కలవాలి, రాహుల్‌ను మీట్ అవ్వాలి అని చెప్పి..” అని చిన్మయి చెబితే “వీడు నా కోసం అక్కడ మార్కెటింగ్ చేస్తున్నాడు..” అని రాహుల్ అన్నాడు. “మార్కెటింగ్‌లో సందీప్ కిషన్‌ది వేరే లెవల్ యాక్చువల్‌గా..” అంటూ కిశోర్ పరువు తీశాడు. దీంతో ‘సినిమాలు లేక ఇలాంటి పనులు చేసుకుంటున్నావా’ అంటూ ఆడియన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.