మళ్లీ పెళ్లి అనేది నరేష్ రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనల సమాహారమే. ఈ సినిమా కథని ఎంత ఫిక్షన్ కథ అని చెప్తున్నా.. లోపల జరుగుతున్న సీన్స్ అన్నీ కూడా నరేష్ జీవితంలో జరిగినవే అనేది అర్థమవుతుంది. కాకపోతే ఈ సినిమాలో కాస్త డీప్ గా తన జీవితాన్ని స్క్రీన్ మీద చూపించాడు నరేష్. ముఖ్యంగా తన మూడో భార్య రమ్యతో ఉన్న గొడవలను కూడా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసాడు.నరేష్ ఈ మూవీ తీయడానికి ప్రధాన ఉద్దేశ్యం తనకు, పవిత్రకు మధ్య ఎలాంటి సంబంధం ఉందో ప్రపంచానికి చెప్పాలనుకోవడమే. సినిమా చూసిన వాళ్లు ఎవరికైనా ఈ విషయం అర్థమవుతోంది.
ఇంకా అలాగే తన జీవితంలో మూడు పెళ్లిళ్లెందుకు చేసుకోవాల్సి వచ్చింది.. ఏ సందర్భంలో అలా చేసుకోవాల్సి వచ్చిందనేది కూడా స్క్రీన్ మీద చూపించాడు. ఇది ఎవరి బయోపిక్ కాదని ఇంకా రమ్యా రఘుపతిపై రివేంజ్ తీర్చుకోవడానికి కాదని చెప్పాడు నరేష్. కానీ ఈ మూవీలో ఈమె పాత్రే మెయిన్ విలన్. తనను ఆమె ఎంతగా వేధించిందో నరేష్ చెప్పాలనే ప్రయత్నం చేశాడు.అయితే అవన్నీ నిజాలే అని నమ్మలేం కూడా. ఎందుకంటే వాళ్లే ఈ సినిమా ఫిక్షన్ అన్నారు కాబట్టి. అలాగే నరేష్, పవిత్ర బయట ఉన్న రిలేషన్ కథకు బాగా హెల్ప్ అయింది. వాళ్లిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ న్యాచురల్‌గా అనిపిస్తాయి. అందుకే దర్శకుడు ఎమ్మెస్ రాజు కూడా ఈ ఇద్దరిపైనే బాగా ఎక్కువగా ఫోకస్ చేసాడు.
ఇక ‘మళ్ళీ పెళ్లి’కి సీక్వెల్ కూడా తీయాలనే ఆలోచన నరేష్ కు ఉందట. ఈ సినిమా అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పై సెటైరికల్ గా, అలాగే పవిత్ర కెరీర్ ప్రారంభం నుండి ఎదుర్కొన్న పరిస్థితులను చూపించారు. మరి ‘మళ్ళీ పెళ్లి 2 ‘ లో ఏం చూపిస్తారు అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయితేనే కదా సీక్వెల్ కి కూడా జనాలు వచ్చేది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.