యాంకర్ విష్ణు ప్రియా ఈ మధ్య మళ్లీ షోలతో యాక్టివ్ అవుతుంది.. గతంలో అందాల ఆరబోతతో సంచలనంగా మారిన ఈ భామ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఈ అమ్మడు గబ్బు మాటలు మాట్లాడింది.. ఆ షోలో పాల్గొన్న మరో కమెడియన్ సెటైర్స్ తో సోషల్ మీడియాలో హల్ చేస్తుంది.. ఈ షో చూసిన నేటిజన్లు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు..

వివరాల్లోకి వెళితే.. తాజాగా సుమ యాంకర్‌గా చేసే `సుమ అడ్డా` షోలో పాల్గొంది. ఇందులో ధన్‌రాజ్‌కి పెయిర్‌గా వచ్చింది. మరోవైపు చమ్మక్ చంద్ర, `బలగం` వేణు కలిసి వచ్చారు. ఈ షోలో ఆద్యంతం నవ్వులు పూయించారు. తమదైన కామెంట్లు, పంచ్‌లు,సెటైర్లతో కామెడీని పంచారు. మరోవైపు సుమ తాలుకూ పంచ్‌లు సైతం బాగా పేలాయి.
కానీ ఇందులో యాంకర్ విష్ణు ప్రియా కామెంట్లు, ఆమె చేసిన చేష్టలు హైలైట్‌గా మారడం విశేషం.. ఈ షోలో ఓ టాస్క్ ఇచ్చింది సుమ. పెళ్లి అనగానే ఏం గుర్తొస్తాయో చెప్పాల్సి ఉంటుంది.ఇందులో విష్ణు ప్రియా `షాపింగ్, బంధువులు అని, ధన్‌రాజ్.. శుభలేఖలు, కళ్యాణ మండపం, బంగారం అని చెప్పొకొచ్చాడు. ఇంతలో విష్ణు ప్రియా రియాక్ట్ అవుతూ `శోభనం` అని చెప్పేసింది. దీంతో నవ్వులు విరిసాయి. కానీ అది రాంగ్ ఆన్సర్ అయ్యింది. దీనికి దర్శకుడు వేణు రియాక్ట్ అవుతూ శోభనం గుర్తొచ్చింది కానీ, తాళిబొట్టు గుర్తుకు రాలేదని సెటైర్ వేయడంతో షో మొత్తం దద్దరిల్లింది. విష్ణు ప్రియా మొఖం వాడిపోయింది..

ఆ తర్వాత చంద్రముఖి` సినిమాలోని సాంగ్‌కి డాన్సు చేస్తూ కాసేపుఉర్రూతలూగించింది విష్ణు ప్రియా. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.. రీల్స్, వీడియో సాంగ్‌లు చేస్తూ ఆకట్టుకుంటుంది. మానస్‌తో కలిసి ఆమె ఒరిజినల్ సాంగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. వీటికి విశేష ఆదరణ దక్కుతుంది. అయితే టీవీ షోస్ లేకపోవడంతో గ్లామర్ ట్రీట్ కూడా తగ్గించింది. కానీ అరుదుగా ఇచ్చినా అదిరిపోయేలా అందాలు ఆరబోస్తుండటం విశేషం… ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..