హీరోయిన్ డింపుల్ హయాతి గురించి అందరికి తెలుసు..ఇటీవల వచ్చిన గోపీచంద్ రామబాణం సినిమాలో నటించింది..తాజాగా తన దురుసు ప్రవర్తనతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి వచ్చింది. డింపుల్ హయతి తన స్నేహితుడు విక్టర్ డేవిడ్ తో కలిసి జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్స్ లో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో DCP గా పనిచేసే IPS అధికారి రాహుల్ హెగ్డే కూడా నివసిస్తున్నారు..
గత కొన్ని రోజులుగా పార్కింగ్ స్థలంలో వీరి కార్లు పెట్టుకునేచోట IPS అధికారి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగుతుంది డింపుల్. IPS అధికారి కారుకి తమ కారుని అడ్డంగా పెడుతున్నారు, డ్రైవర్ చెప్పినా కూడా వినకపోగా అతన్ని తిట్టి, ఆ కారుని కాలితో తన్ని, కారుకి అడ్డంగా ఆన్న మెష్ ని తొలగించి రచ్చ చేసింది డింపుల్. ఆ డ్రైవర్ తో గొడవ పెట్టుకుంది డింపుల్ హయతి. ఇలా పలుమార్లు జరగగా ఇటీవల ఆ IPS అధికారి కారుని తన కారుతో ఢీ కొట్టడంతో మరోసారి గొడవ అయింది. పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు ఐపీఎస్ అధికారి రాహుల్. అయినా కూడా డింపుల్ వినకపోవడంతో కారు డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు..
ఈ మేరకు పోలీసులు డింపుల్, ఆమె స్నేహితుడిపై 353, 341, 279 సెక్షన్ ల కింద, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు నమోదు చేసుకొని డింపుల్ ని, ఆమె ఫ్రెండ్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. ఇద్దర్ని ఈ విషయంలో హెచ్చరించి CRPC 41a కింద నోటీసులు ఇచ్చి, మరోసారి విచారణకు అవసరమైతే రావాలని చెప్పి పంపించారు. దీంతో డింపుల్ ప్రవర్తన ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారింది… ఇక ఈమె కేరీర్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి..