రీసెంట్ గానే స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ఈవెంట్ ని విజయవాడ లోని కైకలూరు ప్రాంతం లో చెయ్యగా, తెలంగాణ లో హైదరాబాద్ ప్రాంతం లో చేసారు. విజయవాడ ఈవెంట్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజారవ్వగా, హైదరాబాద్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కడే మాట్లాడాడు.
టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరికీ ఆహ్వానం అందినప్పటికీ కేవలం రామ్ చరణ్ మాత్రమే వచ్చాడు.ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఈవెంట్ కి హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా హాజరు కాలేకపోయాడు.మరో పక్క రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్ప ప్రసంగం ఇచ్చి నందమూరి అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ చివర్లో ‘జై ఎన్టీఆర్’ అని అనడం అందరినీ ఆశ్చర్యానికి గురియు చేసింది.
మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ తన సొంత తాత ఫంక్షన్ రాకపోయినందుకు నందమూరి ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహం ని పెంచుకున్నారు. ఆ మహానుభావుడి పేరు పెట్టుకొని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నువ్వు ఈరోజు ఆ మహానుభావుడి శత జయంతి వేడుకలనే విస్మరిస్తావా, ఆయన పేరు లేకుంటే ఇండస్ట్రీ లో అసలు నీకు విలువ ఉండేదా, ఏమి పొడిచావని ఈ 23 ఏళ్ళు ఇండస్ట్రీ లో ఉండి అంటూ ఎన్టీఆర్ ని నోటికి వచ్చినట్టు తిడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఎన్టీఆర్ ని ట్యాగ్ చేస్తూ, వెళ్లి ఉండొచ్చు కదా అన్నా, అందరూ ఎందుకు మీ హీరో రాలేదు అంటే సమాధానం చెప్పలేకపోతున్నాము అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలను పట్టించుకోలేదని,కానీ రామ్ చరణ్ వచ్చి ఆయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడడం మేము ఎప్పటికీ మర్చిపోమని, ఇక నుండి రామ్ చరణ్ కూడా మా కుటుంబ సభ్యులలో ఒకరు అంటూ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.