తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ చిత్రం ‘బిచ్చగాడు 2’ రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.కానీ అక్కడ వచ్చిన టాక్ కి ఇక్కడ వస్తున్న వసూళ్లకు సంబంధమే లేకుండా పోయింది.బహుశా ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడం వలనో ఏమో తెలియదు కానీ, బిచ్చగాడు 2 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు.
మొదటి రోజు ఓపెనింగ్ తోనే అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకునేలా చేసిన ఈ సినిమా, రెండవ రోజు కూడా కూడా అదే రేంజ్ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు రెండు కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు కోటి 62 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఇక మూడవ రోజు రెండవ రోజు కంటే ఎక్కువ గా కోటి 88 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది. అలా మూడు రోజులకు కలిపి ఈ సినిమా 5 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.
ప్రాంతాల వారీగా ఒకసారి ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను చూస్తే నైజాం ప్రాంతం లో కోటి 92 లక్షల రూపాయిలను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ లో 97 లక్షలు మరియు ఉత్తరాంధ్ర లో 93 లక్షల రూపాయిలను రాబట్టింది. టీజర్ , ట్రైలర్ ఒక రేంజ్ లో లేకపోయినా కేవలం బిచ్చగాడు సినిమాకి ఉన్న క్రేజ్ కారణంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టింది.
ఇక ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో 46 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 34 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది. తూర్పు గోదావరి జిల్లాలో అయితే కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ మార్కుని అందుకుంది. ఇక ఆ తర్వాత గుంటూరు మరి కృష్ణ జిల్లాలకు కలిపి ఈ చిత్రానికి మూడు రోజుల్లో 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఆరు కోట్ల రూపాయలకు జరగగా, ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటబోతుంది.