యంగ్ టైగర్ ఎన్టీఆర్ #RRR చిత్రం తర్వాత కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ టైం లోనే ప్రారంభమై మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పుట్టిన రోజు కి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు. దీనికి ఫ్యాన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ఆడియన్స్ నుండి మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లోనే వచ్చింది.
అనుకున్న స్థాయిలో సంతృప్తి చెందలేదు. ‘ఆచార్య’ సినిమా అప్పుడే కొరటాల శివ పనితనం అర్థం అయ్యిందని, ఇప్పటికీ కొరటాల శివ అదే ఫామ్ ని కొనసాగిస్తున్నాడని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన మరో లేటెస్ట్ న్యూస్ అభిమానులను కంగారు పెడుతుంది, అదేంటో ఒకసారి చూద్దాము.
రెండవ షెడ్యూల్ కి ప్రారంభానికి ముందు మొదటి షెడ్యూల్ కి సంబంధించిన ఔట్పుట్ ని ఎన్టీఆర్ చూశాడట. ఇది చూసి ఆయన ఎంతో చిరాకు పడినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇంత ఖర్చు చేసి ఆ ఫోటోగ్రఫీ ఏంటి, టేకింగ్ ఏంటి అంటూ కొరటాల శివ మరియు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ని ఇష్టమొచ్చినట్టు తిట్టాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
కొంతమంది అయితే ఎన్టీఆర్ కొరటాల శివ పై చెయ్యి కూడా చేసుకున్నాడని సోషల్ మీడియా లో చెప్తున్నారు. కానీ ఇవన్నీ నమ్మొద్దని, ఎన్టీఆర్ అంటే పడని వాళ్ళు కావాలని ప్రచారం చేస్తున్న రూమర్స్ అని ‘దేవర‘ చిత్రానికి పని చేస్తున్న కొంతమంది యూనిట్ సభ్యులు అంటున్నారు. ఎన్టీఆర్ ఇప్పటి వరకు వచ్చిన ఔట్పుట్ పై ఎంతో సంతోషంగా ఉన్నారని, కొరటాల శివ ఈ చిత్రాన్ని ఇది వరకు ఎప్పుడూ చూడని రేంజ్ మాస్ మూవీ ని అందిస్తున్నాడని అంటున్నారు.