ఇండస్ట్రీ లో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి మాత్రం ఎప్పటికీ చెరిగిపోని బ్రాండ్ ఇమేజి ఉంటుంది. వీళ్ళ మ్యూజిక్ తో చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలోళ్ల వరకు ప్రతీ ఒక్కరిని అలరింపచెయ్యగలరు. అలాంటి పవర్ వీళ్లకు మాత్రమే సొంతం.ఒక సినిమా కథ పరంగా , స్క్రీన్ ప్లే పరంగా ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ సరైన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఫ్లాప్ అవుతాయి.
గతం లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూసాము. కేవలం పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటివి ఎక్కువ గా మణిశర్మ కెరీర్ లోనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘చూడాలని ఉంది’ అనే సినిమా తో ప్రారంభమైన మణిశర్మ సంగీత ప్రస్థానం ఇప్పటికీ దిగ్విజయంగానే కొనసాగుతూ ముందుకు పోతుంది.
మణిశర్మ ఇది వరకు టచ్ చెయ్యని జానర్ అంటూ ఏది లేదు, ఫోక్ సాంగ్స్ , రొమాంటిక్ సాంగ్స్ , మాస్ సాంగ్స్ , క్లాసిక్ సాంగ్స్ ఇలా ప్రతీ జానర్ లో ఆయన అద్భుతమైన ట్యూన్స్ అందించి ప్రేక్షకులను మైమరచిపోయేలా చేసాడు. అలాంటి మణిశర్మ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ మా నాన్న పెద్ద మ్యూజిషియన్..ఆయన చాలా కొత్త రకాల శబ్దాల కోసం ప్రయతం చేస్తూ ఉండేవాడు.
అలా నాకు ఒకరోజు ఆయన కంపోజ్ చేసిన ఒక ట్యూన్ లో నాకు ఒక వెరైటీ సౌండ్ విన్న ఫీలింగ్ వచ్చింది. అప్పటి నుండే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలను నిర్ణయించుకున్న. నేను ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంత గొప్ప స్థానం లో ఉన్నాను అంటే దానికి కారణం ఇళయరాజా గారు. ఆయన అసిస్టెంట్ గా పని చేసి ఎన్నో నేర్చుకున్నాను. అయితే నాకు ఇంత వయస్సు వచ్చింది, ఇప్పటి వరకు నాకు మ్యూజిక్ పూర్తి స్థాయిలో తెలియదు. సినిమాకి ఎంత వరకు అవసరం ఉందో అంతే నేర్చుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు మణిశర్మ.