దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకులు ఈమధ్య కాలం లో మ్యూజిక్ ని సొంతంగా కాకుండా ఇతర బాషల నుండి కాపీ కొడుతూ నిర్మాతల దగ్గర కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం మన టాలీవుడ్ లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో దేవి శ్రీప్రసాద్ మరియు థమన్ టాప్ 2 స్థానాల్లో ఉంటారు.వీళ్లిద్దరు కంపోజ్ చేసే పాటలు మన తెలుగు స్టేట్స్ ని షేక్ చేస్తాయి.

కేవలం వీళ్ళ మ్యూజిక్ ద్వారా సూపర్ హిట్ గా నిల్చిన సినిమాలు చాలానే ఉన్నాయి.కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన నెటిజెన్స్ అన్నీ రకాల వీడియోలు, అన్నీ రకాల సినిమాలు చూడడం ప్రారంభించారు. అది ఇప్పుడు థమన్ మరియు దేవిశ్రీప్రసాద్ కి తలనొప్పిగా మారిపోయింది.వీళ్ళ నుండి ఏ మ్యూజిక్ వీడియో వచ్చినా ,దాని ఒరిజినల్ ట్యూన్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసేస్తున్నారు.
రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సంబంధించి ఒక గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు. ఈ గ్లిమ్స్ వీడియోలో షాట్స్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కానీ, దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఫ్యాన్స్ నిరాశ చెందారు. అంత మంచి వీడియో కట్ కి ఈ నీరసపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం ఏమిటి అని ఫ్యాన్స్ దేవి శ్రీ ప్రసాద్ ని ఇష్టమొచ్చినట్టు ట్విట్టర్ లో ట్యాగ్ చేసి తిట్టారు.

అయితే ఆయన ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సొంతగా కంపోజ్ చెయ్యలేదు. ‘లిండ్ సెయ్ స్టిర్లింగ్ – రౌండ్ టేబుల్ రివల్’ అనే ప్రైవేట్ మ్యూజిక్ వీడియో నుండి లేపేసాడు.ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూస్తే అర్థం అవుతుంది.ఈ వీడియో చూసి ఒకసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ గ్లిమ్స్ వీడియో ని చూడండి.