తెలుగులో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యారు అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్. జబర్థస్త్ కామెడీ షోతో అనసూయ పాపులర్ అయితే.. ఎక్స్ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో రష్మి గౌతమ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు టీవీ ప్రేక్షకులకు వీళ్లిద్దరి పరిచయం పెద్దగా అవసరం లేదు. అంతలా తెలుగు టీవీ తెరపై సంచలనాలు సృష్టిస్తున్నారు వీరిద్దరూ. ఒకే కార్యక్రమంతో ఇద్దరూ స్టార్స్ అయ్యారు కూడా. అప్పటి వరకు ఎలా ఉన్నా జబర్దస్త్ అనే ఒకే ఒక్క షోతో స్టార్ యాంకర్స్ అయిపోయారు ఈ ముద్దుగుమ్మలు.
ఇదే క్రేజ్ ఇప్పుడు సినిమాల్లో కూడా పనికొస్తుంది. జబర్దస్త్ పేరు చెప్పుకుని వరసగా సినిమాలు చేసేస్తున్నారు ఈ యాంకర్స్. ఐతే.. వీళ్లిద్దరిలో అనసూయ భరద్వాజ్.. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలుకు తల్లైన ఇప్పటికే వరుస షోలతో పాటు సినిమాలతో బిజీగా ఉంది. కానీ రష్మి గౌతమ్ మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉంది. మ్యారేజ్ తర్వాత తన కెరీర్ను కంటిన్యూ చేయగలనా లేదా అని ఇన్ని రోజులు డైలామాలో ఉండే. కానీ సుమ, అనసూయ వంటి తోటి యాంకర్స్ పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్ను సాఫీగానే కొనసాగిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మీ గౌతమ్ అనసూయ గురించి మాట్లాడింది. అనసూయ చేసిన తప్పు నేను ఎన్నటికీ చేయను అంటూ చెప్పవచ్చింది.. నాకు సినిమాలు చేయడం ఇష్టమే.. కానీ దానికోసం నా యాంకర్ కెరియర్ను మానుకోను.. అంటూ చెప్పింది రష్మీ గౌతమ్. ఇప్పటికే జబర్దస్త్ నుండి కానీ వేరే షో ల నుండి కానీ బయటకు వెళ్లిన వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు కావచ్చు.. అందుకే నేను అసలు అలాంటి తప్పు చేయను అంటూ చెప్పుకొచ్చింది రష్మీ. ఈ వీడియో చూసిన చాలా మంది అనసూయని దృష్టిలో పెట్టుకొని రష్మీ ఇలా మాట్లాడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అనసూయ సినిమాల కోసం జబర్దస్త్ మానేసిన వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది.